చదువుతో క్రీడలూ అవసరం | - | Sakshi
Sakshi News home page

చదువుతో క్రీడలూ అవసరం

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

ఎమ్మెల్సీ రాజశేఖర్‌

ముగిసిన రాష్ట్రస్థాయి

జూనియర్స్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరం అని ఎమ్మెల్సీ పి.రాజశేఖర్‌ తెలిపారు. ఆదివారం జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి జూనియర్స్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ పోటీలు క్రీడామైదానంలో ఘనంగా ముగిసాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాజశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరై ఆటల్లో గెలుపోటములు సహజమని, విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలని సూచించారు. అనంతరం ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బాలుర విభాగంలో ఎన్టీఆర్‌ జిల్లా, కాకినాడ జిల్లా, గుంటూరు జిల్లా ప్రధమ, ద్వితీయ, తృతీయస్థానాలు, బాలికల విభాగంలో ఎన్టీఆర్‌ జిల్లా, కడప, గుంటూరు జిల్లాలు మొదటి మూడుస్థానాలు సాధించాయి. సంఘ కార్యదర్శి నీలిమ మాట్లాడుతూ అక్టోబరులో కాశ్మీర్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలలో విజేతలు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ కార్పొరేటర్‌ నల్లబిల్లి సుజాత, డీఎస్‌డీఓ సతీష్‌కుమార్‌, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, వివిధ జిల్లాల కోచ్‌లు, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement