ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ టేబుల్ టెన్నిస్ క్లస్టర్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ప్రతిభ చూపిన విజేతలకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఆర్ రెడ్డి విద్యాసంస్థల వైస్ ప్రెసిడెంట్ వీవీ బాలకృష్ణ, జాయింట్ సెక్రటరీ వల్లభనేని శ్రీకృష్ణ, ట్రెజరర్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు
డబుల్స్ విభాగంలో..: అండర్–19 బాలుర విజేత – చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్, రన్నరప్ – శ్రీ ప్రకాష్, పెద్దాపురం, అండర్ 19 బాలికల విజేత – శ్రీ ప్రకాష్, పెద్దాపురం, రన్నరప్ – సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్
సింగిల్స్ విభాగంలో..: అండర్ 19 బాలుర విజేత – చేతన్ సాయి, చిరాక్ స్కూల్, రన్నరప్ – టీ.సాయి శ్రవణ్, శ్రీ ప్రకాష్, పెద్దాపురం, అండర్ 19 బాలికల విజేత – మౌపర్ణ దాస్, శ్రీ ప్రకాష్ సినర్జీ, పెద్దాపురం, రన్నరప్ – ఎం. లినిషా, సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్
పోలవరం కాలువలో మృతదేహం లభ్యం
దేవరపల్లి: పోలవరం కుడి కాలువలో అనంతపల్లి వంతెన వద్ద 45 ఏళ్ల వయస్సు గల పురుషుడి మృతదేహాన్ని ఆదివారం పోలీసులు కనుగొన్నారు. నీలం రంగు చొక్కా, ఫ్యాంటు ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్టు నల్లజర్ల సీఐ రవికుమార్ తెలిపారు. ఎవరికై నా సమాచారం తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఆయన తెలిపారు.


