దిశ బిల్లు రద్దయితే మహిళలు, చిన్నారుల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే మద్యం ఏరులై పారుతోంది. ప్రతి వీధిలోనూ బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. గంజాయి ఎక్కడికక్కడే దొరుకుతోంది. వాటిని తాగి మత్తులో ఆకతాయిలు, నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందువల్లే గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో దిశ బిల్లు రద్దు చేస్తే నేరగాళ్లలో భయం తగ్గి రెచ్చిపోయే ప్రమాదం ఉంది.
–నాగులాపల్లి ధనలక్ష్మి,
మాజీ ఎమ్మెల్యే,
రంపచోడవరం


