పుస్తెలతాడు అపహరణ | - | Sakshi
Sakshi News home page

పుస్తెలతాడు అపహరణ

Aug 9 2026 1:40 AM | Updated on Aug 9 2026 1:40 AM

పిఠాపురం రూరల్‌: వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును ఓ యువకుడు తెంచుకుని పరారైన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిత్రాడకు చెందిన అడబాల కమల (65) శనివారం మధ్యాహ్నం 3 గంటల వేళ పట్టణంలోని పల్లపు వీధిలోని రామాలయం మీదుగా వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఓ యువకుడు ఆమె మెడలోని పుస్తెలతాడును తెంచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై లోకేష్‌ కేసు దర్యాప్తు చేపట్టారు.

పశువుల లారీ సీజ్‌

కిర్లంపూడి: అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.సతీష్‌ తెలిపారు. దీనిపై ఆయనను వివరణ కోరగా శుక్రవారం అర్ధరాత్రి కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీల్లో ఒడిశా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న లారీలో 20 ఆవులు, 20 లేగదూడలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. లారీ డ్రైవర్‌ను మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, లారీని సీజ్‌ చేసినట్టు ఆయన తెలిపారు. పశువులను రాజమహేంద్రవరంలోని గోశాలకు అప్పగించినట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement