ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్
అమలాపురం టౌన్: ప్రభుత్వం దిశ చట్టాన్ని రద్దు చేసి మహిళల భద్రత గాలికి వదిలేసిందని ఆర్పీఐ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీబీ లోక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం రద్దుతో కూటమి ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్న వ్యతిరేక భావం వ్యక్తం అవుతోందన్నారు. స్థానిక అరిగెల పాలంలో శనివారం జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో లోక్ మాట్లాడుతూ రద్దు వెనుక ప్రభుత్వం కుట్ర దాగి ఉందని అన్నారు. మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్న క్రమంలో ఈ చట్టాన్ని ఇంకా కట్టుదిట్టం చేయాల్సింది పోయి రద్దు చేయడంపై మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ఈ చట్టాన్ని పునరుద్ధరించాలని ఆయన సూచించారు. ఽసమావేశంలో ఆర్‌పీఐ నాయకులు డి.శ్యామలరావు, ఈవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉరి వేసుకుని
వ్యక్తి ఆత్మహత్య
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కాతేరు గామన్ బ్రిడ్జి అండర్ బైపాస్ రోడ్డు కొంతమూరు వైపు వెళ్లే దారిలో శనివారం నాలుగు విద్యుత్ స్తంభాల మధ్య ఉన్న ఇనుపరాడ్‌కు గుర్తు తెలియని వ్యక్తి చొక్కాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డులోని వివరాల మేరకు అస్సాం రాష్ట్రం కచర్ లేకిఫూర్‌కు చెందిన అహ్మద్‌ఖాన్‌గా గుర్తించారు. సుమారు 28 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నాడని, అతని మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచినట్టు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వి.అప్పారావు తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు 94407 96532 ఫోన్ నంబరుకు తెలియజేయాలన్నారు.


