అరటి బొంద ఉత్పత్తులపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

అరటి బొంద ఉత్పత్తులపై శిక్షణ

Aug 6 2026 12:39 AM | Updated on Aug 6 2026 12:39 AM

చాగల్లు: కొవ్వూరు గ్రామీణ ప్రాంతాల్లో వృథాగా పడేసే అరటి వ్యర్థాలను ఆదాయ వనరుగా మలుచుకుని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని డీఆర్‌డీఏ పీడీ బి.నగేష్‌ అన్నారు. కొవ్వూరు మండలం వేములూరు రోడ్డులోని హార్టీకల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో బుధవారం డ్వాక్రా మహిళలకు ఈ మేరకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ వల్ల మహిళల జీవనోపాధి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. ఇందులో భాగంగా నందమూరు గ్రామానికి చెందిన 25 మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం తయారీకి ఉపయోగించే యంత్రాలకు సబ్సిడీ ఇస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్‌ అధికారి ఎన్‌.మల్లికార్జునరావు, ఏపీఎంఐపీ పీడీ ఎ.దుర్గేష్‌, హార్టికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఏడీఆర్‌ డి.వెంకటస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement