ఇన్నోవేటర్ పురస్కారం
రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
అనపర్తి: అటల్ ఇన్నోవేషన్ మిషన్, విజయవాడ కేఎల్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన హైడ్రో లిఫ్ట్ ర్యామ్ పంపు రైతులకు బహుళ ప్రయోజనకారి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించినట్టు హైడ్రోలిఫ్ట్ సృష్టికర్త పెదపూడి మండలం కై కవోలు గ్రామానికి చెందిన పంపన శ్రీనివాస్ అన్నారు. ఇటీవల రాష్ట్రపతితో పాటు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చేతుల మీదుగా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శ్రీనివాస్ ఉత్తమ గ్రాస్‌రూట్ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి ఆయన అందుకున్న ప్రశంసా పత్రాన్ని, పురస్కారాన్ని చూపారు.


