పెద్దాపురం: ఎందరో విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతున్న స్థానిక పీఎంశ్రీ జవహార్ నవోదయ విద్యాలయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని వక్తలు పేర్కొన్నారు. బుధవారం పీఎంశ్రీ జవహార్ నవోదయ ఫౌండేషన్ డే వైభవంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ శరత్‌చంద్ర కీర్తి అధ్యక్షతన సాగిన కార్యక్రమంలో విజయనగరం నవోదయ విశ్రాంత ప్రిన్సిపాల్ సుబ్బారావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విశ్రాంత ఉపాధ్యాయుడు శివరామకృష్ణ, పూర్వ విద్యార్థులు డాక్టర్ మల్లేశ్వరరావు, గోదావరి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాజా రత్నాకర్, శ్రీసాయి, జగన్నాథం, సతీష్‌కుమార్, కోటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులను సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


