● పురుషుల డబుల్స్.. మహిళల సింగిల్స్..
మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకాల కై వసం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో నాలుగు రోజుల పాటు సాగిన సీనియర్స్ బ్యాడ్మింటన్ స్టేట్‌మీట్ బుధవారంతో ముగిసింది. శాంతినగర్‌కాలనీలోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన పోటీల్లో విశాఖపట్నం, కృష్ణ, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు, ప్రకాశం షట్లర్లు సత్తా చాటి జయకేతనం ఎగురవేశారు.
విజేతల వివరాలు ఇవీ
● పురుషుల డబుల్స్ విభాగంలో వి.హరికృష్ణ (తూర్పుగోదావరి)–టి.చరణ్‌రామ్ (చిత్తూరు) జంట విజేతగా నిలవగా, సాయిపవన్ కర్రి (తూర్పుగోదావరి)–ఎం.ధర్మాఘ్న (గుంటూరు) జంట రన్నరప్‌గా నిలిచారు.
● ఇక మహిళల సింగిల్స్ చాంపియన్‌గా కందేరి నవ్య (చిత్తూరు) నిలవగా, కె.దుర్గా ఇషా (తూర్పుగోదావరి) రన్నరప్‌గా నిలిచింది.
● మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో కర్రి సాయి పవన్ (తూర్పుగోదావరి)–దండు పూజ (చిత్తూరు) జంట విజేతగా నిలవగా, బి.అభిషేక్ (తూర్పుగోదావరి)–గగనశ్రీ చౌదరి కె (కృష్ణ) రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.
జాతీయ పోటీల్లో సత్తా చాటాలి..
ఏపీ సీనియర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులంతా సౌత్‌జోన్ నేషనల్స్, ఆలిండియా నేషనల్స్ పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి విజయదుందుభి మోగించాలని ఏపీ బ్యాడ్మింటన్ సీఈఓ, విశాఖ ఈగల్ టీం ఏఎస్పీ చుక్కా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అనంతరం ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు.


