● ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన
● రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయమైంది. స్థానిక వై.జంక్షన్‌లో కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. విభాగ్ కన్వీనర్ సత్యసాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా మేల్కొనాలని, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా విద్యారంగంపై చిత్తశుద్ధి కనిపించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బకాయి పడిన సుమారు రూ.6,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఏ కేటగిరి విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసే విధానాన్ని అరికట్టాలని, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నూతన భవనాలకు మార్చి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నగర కార్యదర్శి రామ్, జిల్లా కన్వీనర్ లలిత్, పృథ్వీ, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.


