ఆశీలు కథాసంపుటి ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఆశీలు కథాసంపుటి ఆవిష్కరణ

Aug 4 2026 12:11 AM | Updated on Aug 4 2026 12:11 AM

బోట్‌క్లబ్‌: మానవ జీవితం ప్రతిబింబించే ఆలోచనలు, వాటి నియంత్రణలో జీవన విధానంలో ఏర్పడే సంఘర్షణల నేపథ్యంలో వెలుగు చూసిన కథాసంపుటి అశీలు అని ప్రముఖ సాహితీవేత్త అవధానుల మణిబాబు అన్నారు. రచయితీ, వైద్యురాలు కాళ్ళుకూరి శైలజ రచంచిన ఆశీలు కథాసంపుటి ఆవిష్కరణ స్థానిక రామారావుపేట వేణుగోపాల సంస్కృత ప్రచార సభలో సోమవారం జరిగింది. మణిబాబు పుస్తకాన్ని ఆయన విశ్లేషణ చేశారు. ప్రముఖ రచయిత దాట్ల దేవదానంరాజు మాట్లాడుతూ రచయిత శైలజ తన ఆలోచనలకు, భావజావానికి ఇష్టమైన అంశాన్ని ఎంచుకొని సామాజిక పరిస్థితుల ప్రాతిపదికగా పరిష్కారం ఉండాలని, దేశంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలే కథారచన నడిచిందన్నారు. వారి వృత్తిలో తారసపడే యవ్వన వయస్సు, విద్యార్థి దశలో ఎదురుచూస్తున్న ప్రేమవంటి సమస్యల ఆధారంగా రచన సాగిందని వివరించారు. ప్రచార సభ ప్రధాన కార్యదర్శి కిరణ్‌ మాట్లాడుతూ శైలజ వృత్తిలో నిబద్ధత మనసును చూడగలిగిన గొప్ప రచయిత అన్నారు. రాబోయే తరాల యువతకు ఎలా చదవాలో మార్గదర్శకత్వం చేశారన్నారు. గట్టి కృష్ణ దేవరాయలు, మేకా మన్మథరావు, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, గొట్టుముక్కుల వెంకట సత్యనరసింహశాస్త్రి పాల్గొన్నారు.

పుట్టింటికి వెళ్లిన భార్య రాలేదని వ్యక్తి ఆత్మహత్య

ఆత్రేయపురం: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో అలిగిన ఒక భర్త తన పీక తనే కోసుకుని మృతి చెందిన సంఘటన ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో చోటుచేసుకుంది. సుజాత కోళ్ల ఫారంలో బోయిన భోజప్ప (24) పనిచేస్తున్నాడు. ఒక నెల నుంచి అనారోగ్యం కారణంగా అతడి భార్య అక్షయ పుట్టింటికి వెళ్లింది. ఆమె తిరిగి రాకపోవడంతో అలిగిన భర్త తీవ్ర మనస్థాపంతో ఆదివారం రాత్రి కత్తితో తన పీకను తనే కోసుకుని మృతి చెందాడు. దీనిపై అతని తండ్రి బోయిన దాసు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌.రాము తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

దేవరపల్లి: పామాయిల్‌ తోటలో గెలలు కోస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై కార్మికుడు మృతి చెందిన సంఘటన నల్లజర్ల మండలం జగన్నాథపురంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తేంకల ధర్మయ్య (30) కౌలు రైతు పాములరాజు ఆయిల్‌పామ్‌ తోటలో గెలలు కోయడానికి పనికి వెళ్లాడు. గెలలు కోస్తుండగా ఇసుప రాడ్డు కత్తి ప్రమాదవశాత్తూ చెట్లపై ఉన్న విద్యుత్‌ తీగలకు తగిలి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధర్మయ్య అక్కడకక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆంజనేయబాబు తెలిపారు.

త్రుటిలో తప్పిన ప్రమాదం

కంబాలచెరువు: స్థానిక జాంపేట చేపలమార్కెట్‌ వద్ద ఉన్న మున్సిపల్‌ కాంప్లెక్స్‌ భవనం పైకప్పు గోడ కుప్పకూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనతో అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మున్సిపల్‌ కాంప్లెక్స్‌ భవనం శిథిలమైంది. అందులోని రెండు అంతస్తుల్లో వ్యాపార సముదాయాలు నడుస్తున్నాయి. నిత్యం ఆ ప్రాంతంలో రద్దీగా ఉంటుంది. వర్షాల కారణంగా పూర్తిగా నానిపోయి పై అంతస్తు గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భవనం మొత్తం పాడై, వర్షాలు వస్తే పైకప్పు నుంచి నీరు లీకవుతోందని దుకాణదారులు చెబుతున్నారు.

ప్రియురాలి ఫిర్యాదు.. ప్రియుడి అరెస్ట్‌

కాకినాడ క్రైం: ఎంబీఏ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య ప్రేమ చివరికి కేసు పెట్టి అరెస్టు చేయించేంత వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే, కాకినాడ డ్రైవర్స్‌ కాలనీకి చెందిన పట్టా తేజ నరసింహస్వామి (22) సూరంపాలెంలోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. అదే తరగతిలో కాకినాడకు చెందిన ఓ విద్యార్థిని చదువుతోంది. కొన్నాళ్లుగా వీరిరువురు ప్రేమించుకుంటున్నారు. తనతో చనువుగా ఉండి కొద్ది రోజుల క్రితం స్థానిక వెంకట్‌నగర్‌లో ఓ లాడ్జికి తీసుకువెళ్లి స్వామి అత్యాచారం చేశాడ ని ఆ విద్యారిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కాకినాడ టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇష్టపూర్వకంగానే ఉంటూ యువతి తప్పుడు కేసు పెట్టిందని యువకుడి తల్లిదండ్రులు, సహ విద్యార్థులు అంటుంటే, తనను వంచించాడని యువతి, ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement