● స్వామివారిని దర్శించిన
30 వేల మంది భక్తులు
● రూ.35 లక్షల ఆదాయం
● రూ.రెండు వేల వ్రతాల నిర్వహణ
అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించి రెండు వేల వ్రతాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. దేవస్థానానికి రూ. 35 లక్షలు ఆదాయం సమకూరిందని, నిత్యాన్నదాన పథకంలో ఆరు వేల మంది భోజనం చేశారని అధికారులు తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల రథసేవను మంగళవాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు.
నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,101 విరాళం
సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన దాసరి మోహన్‌రెడ్డి ఆదివారం రూ.1,00,101 విరాళాన్ని సమర్పించారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా అక్టోబర్ 29న దాసరి లోక్ ఆర్యనాథ్ పేరున అన్నదానం చేయాలని కోరారు. దాతకు ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి ప్రసాదం, చిత్రం, అన్నదానం బాండ్ అందజేశారు.


