మార్కెట్లో పొగాకు ధరలు ఇలానే ఉంటే కోలుకోవడం కష్టం. మూడెకరాల దేవస్థానం భూమి కౌలుకు తీసుకుని పొగాకు పంట వేశాం. ఎకరాకు రూ. 3 లక్షల పెట్టుబడి పెట్టాం. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం కిలో రూ. 275 పలుకుతుంది. ఈ ధరకు పొగాకు అమ్మితే రూ. 5 లక్షల నష్టం వస్తోంది. గత ఏడాది గిట్టుబాటు ధర రావడంతో ఈ ఏడాది అధిక పెట్టుబడి పెట్టి మరీ పంట వేశాను.
– దొడ్డిగర్ల ప్రభాకరరావు, కౌలు రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం
కౌలు సొమ్ము రాని పరిస్థితి
మార్కెట్లో పొగాకుకు గిట్టుబాటు ధర లేదు. ఈ ఏడాది అధిక పెట్టుబడి పెట్టి పంట వేశాను. ఎకరాకు రూ. 3.20 లక్షల ఖర్చు అయ్యింది. రెండు బ్యారన్లు రూ. 5 లక్షలు, 8 ఎకరాల భూమి రూ. 5 లక్షలకు అద్దెకు తీసుకుని పంట వేశాను. మార్కెట్లో ధర ఇలాగే ఉంటే సుమారు రూ. 15 లక్షల నష్టం వస్తుంది. ప్రభుత్వం కౌలు కార్డు కూడా ఇవ్వలేదు,. జగనన్న ప్రభుత్వంలో కౌలు కార్డులు ఇచ్చారు. కౌలు సొమ్ము కూడా రాని పరిస్థితి.
– గుమ్మడి శివాజీ, కౌలు రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం


