అభ్యర్థుల జీవితాలతో ఆటలొద్దు | - | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల జీవితాలతో ఆటలొద్దు

Jul 31 2026 12:21 AM | Updated on Jul 31 2026 12:21 AM

డీఎస్సీ అక్రమాలతో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగింది. తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించి మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలి.

డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌,

పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి

పోరాటం కొనసాగిస్తాం

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించే వరకూ పోరాడతాం. నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలి. లేకుంటే విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి పోరాడతాం.

– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్‌

బాబు పాలనలో

విద్యార్థులకు అన్యాయం

బూటకపు హామీలతో అన్ని వర్గాలనూ చంద్రబాబు మోసం చేశారు. మహానేత వైఎస్సార్‌ పాలనలో, మాజీ సీఎం జగన్‌ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు.

– తలారి వెంకటరావు, కొవ్వూరు సమన్వయకర్త

రూ.2,160 కోట్ల భృతి బాకీ

ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన సుమారు 3 లక్షల మందికి రూ.2,160 కోట్లు తక్షణం విడుదల చేయాలి.

– జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు సమన్వయకర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement