దేవరపల్లి: కాపు ఉద్యమ నేత ముద్రగడపై నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని సీఎం చంద్రబాబును వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రశ్నించారు. గోపాలపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నీచ రాజకీయాలపై రాజా ఫైర్ అయ్యారు. ముద్రగడ సంస్మరణ సభ పెడితే బోండా ఉమను సంజాయిషీ కోరడం నీచ రాజకీయాలకు నిదర్శనమని ఆయన అన్నారు. కాపులను నమ్మించడం కోసం ఎన్నాళ్లు నటిస్తారని ఆయన నిలదీశారు. కాపులు ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతాయన్నారు. ఎన్నికల ముందు మాట్లాడినప్పుడు చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ డ్రామా ఆర్టిస్టులు మాదిరిగా మీరు మీ మిత్ర బృందం కాపులపై చూపించిన డ్రామా అంతా గమనించారని ఆయన అన్నారు. కాపులను నమ్మించడం కోసం కాపుల ఓట్ల కోసం ఒక యాక్టర్‌ను పెట్టుకుని ఏ రకంగా యాక్టింగ్ చేశారో చూశామన్నారు.
చంద్రబాబుపై జక్కంపూడి రాజా ధ్వజం


