డీఎస్సీ నియామకాలపై మెరిట్ లిస్ట్‌ను వెబ్‌సైట్‌లోనూ, కలెక్టరేట్ల వద్ద ఎందుకు పెట్టలేదు. పాత జీవో స్థానే నియామకాల అనంతరం మరో జీవో తీసుకువచ్చి ప్రవేశ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. ఇందులో లోకేశ్‌దే పూర్తి బాధ్యత. ఆయన తక్షణం రాజీనామా చేయాలి.
– మార్గాని భరత్‌రామ్, మాజీ ఎంపీ,
రాజమహేంద్రవరం అర్బన్
నియోజకవర్గ సమన్వయకర్త
స్పోర్ట్స్ కోటా
పేరిట అమ్మేశారు
డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమాలకు పాల్పడ్డారు. నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు జీవో 4ను, జీఏడీ జీవో 47 ఇచ్చారు. విద్యార్హతతో పని లేకుండా ఉద్యోగాలు ఇచ్చేలా మార్పులు చేశారు. జాతీయ స్థాయి విజేతలకు కాకుండా, రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చేశారు.
– జక్కంపూడి రాజా,
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు


