లభ్యం కాని గల్లంతైన వారి ఆచూకీ | - | Sakshi
Sakshi News home page

లభ్యం కాని గల్లంతైన వారి ఆచూకీ

Jul 30 2026 12:33 AM | Updated on Jul 30 2026 12:33 AM

చింతూరు: ఘాట్‌రోడ్‌లో వ్యూ పాయింట్‌ వద్ద సోకిలేరు వాగులో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మన్యం అందాలు తిలకించేందుకు వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా వీరంపాలేనికి చెందిన పెండెం కల్యాణ్‌, పెండెం బాబి మంగళవారం వ్యూ పాయింట్‌ వద్ద సోకిలేరు వాగులో గల్లంతైన సంగతి విదితమే. మంగళవారం రాత్రి వరకు వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బుధవారం ఉదయం నుంచి తిరిగి వాగులో వెతుకులాట ప్రారంభించారు. చింతూరు సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్సై అబ్దుల్‌ నాసిర్‌హుస్సేన్‌ పర్యవేక్షణలో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తాళ్లు, కర్రల సాయంతో సాయంత్రం వరకు వెతికినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement