రాయవరం: తల్లి పాలు అమృతంతో సమానం. పుట్టిన మరుక్షణం నుంచి కనీసం ఆరు నెలలైనా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ తదితర అంతర్జాతీయ సంస్థలతో పాటు, జాతీయ సంస్థలు తల్లిపాల ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖలు సంయుక్తంగా ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్’ అనే నినాదంతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
తూర్పుగోదావరి జిల్లాలో 1,798 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 9,419 మంది గర్భిణులు, 7,373 మంది బాలింతలు, 0–6 సంవత్సరాల చిన్నారులు 6,704, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 42,964, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 27,182 మంది ఉన్నారు.
బిడ్డకు ముర్రుపాలే తొలి టీకా
శిశు మరణాల నియంత్రణకు చెక్
పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టాల్సిందే
ఆగస్టు 1 నుంచి 7 వరకు
తల్లిపాల వారోత్సవాలు
జిల్లాలో 9,479 మంది గర్భిణులు, 7,373 మంది బాలింతలు


