గుర్తుకొచ్చింది | - | Sakshi
Sakshi News home page

గుర్తుకొచ్చింది

Mar 4 2026 7:42 AM | Updated on Mar 4 2026 7:42 AM

కొన్ని ప్రదేశాలు కొండ గుర్తులతో ప్రాచుర్యం పొందుతుంటాయి. వాటిలో రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కొంతమూరులోని చింతచెట్టు సెంటర్‌ ఒకటి. ఆ ప్రాంతంలో దాదాపు 50 ఏళ్లుగా ఓ చింతచెట్టు ఉండేది. ఆటో, బస్సుల్లో వచ్చిన వారికి అదే కొండగుర్తుగా ఉండేది. ఆర్‌అండ్‌బీ రోడ్డు విస్తరణలో భాగంగా 2015 మార్చి 4వ తేదీన ఆ చెట్టును తొలగించారు. అయినా ఇప్పటికీ ఆ సెంటర్‌ను చింతచెట్టు సెంటర్‌గానే పిలుస్తారు. ఆ చెట్టును తొలగించినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడ్డారని మాజీ సర్పంచ్‌ అత్తిలి భీమశంకరం గుర్తు చేసుకున్నారు.

– రాజమహేంద్రవరం రూరల్‌

ఇలా.. రీవర్స్‌

రఘుదేవపురం ర్యాంపు నుంచి ఇసుక లారీలు మంగళవారం రాజమహేంద్రవరం – సీతానగరం నాలుగు లేన్ల రోడ్డు ఎక్కాయి. అదే రోడ్డులో మైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే ర్యాంపు నుంచి తిరిగి గోదావరి పరివాహక ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి ఇసుక ఎగుమతులను ర్యాంపు నిర్వాహకులు నిలిపేశారు. ప్రక్కిల్లంక, సీతానగరం రెవెన్యూ లంక భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొంది, నిబంధనలను తుంగలో తొక్కి అధిక లోడుతో లారీలపై ఇసుక తరలిస్తున్నారు. బిల్లులు లేకుండా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మైన్స్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిసి ఇలా వెనక్కి తిప్పేశారు. అనంతరం రాత్రి సమయంలో తరలించారు. – సీతానగరం

రఘుదేవపురం ర్యాంపు వద్ద గోదావరి తీరంలోనిలిపిన ఇసుక లారీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement