పంచాక్షరి ప్రభంజనమై.. | - | Sakshi
Sakshi News home page

పంచాక్షరి ప్రభంజనమై..

Feb 16 2026 7:47 AM | Updated on Feb 16 2026 7:47 AM

పంచాక

పంచాక్షరి ప్రభంజనమై..

శివరాత్రి సందర్భంగా రాజమహేంద్రవరం కోటిలింగాల

ఘాట్‌లో స్నానాలకు వచ్చిన భక్తులు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గోదావరి తీరం శివ పంచాక్షరితో మార్మోగిపోయింది. ఆదివారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని అన్ని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువ జాము నుంచే శివాలయాల్లో భక్తులు పరమేశ్వరుని దర్శనాల కోసం బారులుతీరారు. పుష్కరఘాట్‌, కోటిలింగాల ఘాట్‌, సరస్వతి ఘాట్‌, వీఐపీ ఘాట్‌, కొవ్వూరు గోష్పాదక్షేత్రాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సమీప ఆలయాల్లోని శివలింగాలకు అభిషేకాలు, పూజలు చేశారు. స్థానిక భువనేశ్వరీ సమేత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం, గోదావరి గట్టున ఉన్న ఉమా మార్కండేయేశ్వర ఆలయం, సారంగధరేశ్వర ఆలయం, శృంగేరీ జగద్గురు శంకరమఠం, శారద పీఠంలో కొలువైన చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగం, క్వారీ మార్కెట్‌ సెంటర్‌లోని గుడి కోరి (గుడి క్వారీ)గా పిలిచే శివాలయం, జాంపేటలోని ఉమా రామలింగశ్వర ఆలయం, గోదావరి ఒడ్డున నిర్మించిన మహాకాళేశ్వర ఆలయం (ఉజ్జయిని ఆలయం) తదితర ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని అభిషేకాలు చేయించుకున్నారు.

అంక్షల నడుమ దాతల వితరణ

గోదావరి జిల్లా అంటేనే ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు. అటువంటిది ఏదైనా పండుగ వచ్చిందంటే ఇక్కడివారి దాతృత్వం మరింత మెండుగా ఉంటుంది. ఆ మేరకు ముందుకు వచ్చిన దాతల ఉత్సాహంపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లింది. వితరణలకు అనుమతులు తప్పనిసరి చేయడంతో దాతలు ఒకింత ఇ బ్బంది పడ్డారు. భక్తకోటికి అవసరమైన సౌకర్యాల కల్పన ప్రభుత్వాల వల్ల కుదిరే పని కాకపోవడంతో ఏటా దాతలు ముందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సేవకు నిబంధనలేంటని దాతలు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఎవరికి తోచినట్టు వారు మజ్జిగ, పులిహోర, పలావు, రస్నా తది తర అన్నపానీయాలు అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి రథోత్సవం

కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద తెల్లవారు జాము నుంచే గోదావరినదిలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు

ఇలా నివారించవచ్చు

పిల్లల్లో మూడురకాల పురుగులు ఉండే అవకాశం ఉంది. అవి నులిపురుగులు, ఏలిక పాములు, కొంకి పురుగులు. వీటి నిర్మూలనకు అల్బెండజోల్‌ మాత్రను భోజనం తరువాత తీసుకోవాలి. ఐదేళ్ల లోపు పిల్లలకు మాత్రను పొడిచేసి వేయాలి. భోజనానికి ముందు తప్పని సరిగా చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకోవాలి.

– డా.ఇంద్రజ, పిల్లల వైద్య నిపుణురాలు, రాజమండ్రి

ఉచితంగా పంపిణీ

జిల్లాలో పిల్లలందరికీ ఆల్బెండజోల్‌ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తాం. రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ఈ మాత్రల పంపిణీని విజయవంతం చేస్తాం.

– డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు,

డీఎంహెచ్‌వో, తూర్పుగోదావరి

శివనామ స్మరణతో

మార్మోగిన శివాలయాలు

భారీగా అభిషేకాలు, పూజలు

చేసుకున్న భక్తులు

గోదావరి ఘాట్లలో

పుణ్యస్నానాలు చేసిన ప్రజలు

1.31 లక్షల మంది పుణ్యస్నానాలు

కమిషనర్‌ రాహుల్‌ మీనా

రాజమహేంద్రవరం సిటీ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 ఘాట్‌లలో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు సమగ్ర భద్రతా చర్యల నడుమ 1.31 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు కమిషనర్‌ రాహుల్‌ మీనా వెల్లడించారు. మహా శివరాత్రి వేడుకలు నగరవ్యాప్తంగా కన్నుల పండువగా కొనసాగాయన్నారు. ఘాట్‌ చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్‌ చేస్తూ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశామని చెప్పారు. కోటిలింగాల ఘాట్‌, పుష్కర ఘాట్‌లలో అత్యధికంగా భక్తులు స్నానాలు చేశారన్నారు. రానున్న పుష్కరాలకు ఓ ట్రయల్‌ రన్‌లా ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సాయంతో ఈ గణాంకాలను సేకరించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన ఘాట్‌ల వద్ద పోలీస్‌, కమాండ్‌ కంట్రోల్‌ బృందాల సమన్వయంతో భక్తులు స్నానాలు చేశారన్నారు. భక్తుల భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, డ్రోన్లు ఉపయోగించినట్లు చెప్పారు. చిన్న పిల్లలకు డిజిటల్‌ ట్యాగ్‌ వేయటం ద్వారా తప్పిపోయిన ముగ్గురు చిన్నారులను వెంటనే గుర్తించినట్టు తెలిపారు. 1,200 మంది నగరపాలక సంస్థ అధికారులు, 77 మంది వలంటీర్లు విధుల్లో పాల్గొన్నారని రాహుల్‌ మీనా తెలిపారు.

పంచాక్షరి ప్రభంజనమై..1
1/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..2
2/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..3
3/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..4
4/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..5
5/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..6
6/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..7
7/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..8
8/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..9
9/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..10
10/11

పంచాక్షరి ప్రభంజనమై..

పంచాక్షరి ప్రభంజనమై..11
11/11

పంచాక్షరి ప్రభంజనమై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement