నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
కలెక్టర్ కీర్తి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఐచ్ఛిక సెలవు ప్రకటించిన దృష్ట్యా జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించాల్సిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లను సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేసి చెప్పవచ్చునని, వాట్సాప్ గవర్నెన్స్ 95523 00009కు ఫోన్ చేసి సత్వర పౌర సేవలు పొందవచ్చన్నారు.
హోరాహోరీగా
బ్యాడ్మింటన్ ఫైనల్స్
● మిక్స్‌డ్ డబుల్స్‌లో కాకినాడ..
● 40 ప్లస్ మెన్స్‌లో విశాఖ..
● మెన్స్ డబుల్స్‌లో హైదరాబాద్ విజేతలు
● ముగిసిన ఉభయ రాష్ట్రాల స్థాయి టోర్నీ
అమలాపురం టౌన్: అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ఇన్‌డోర్ స్టేడియంలో శని, ఆదివారాల్లో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్స్ హోరాహోరీగా జరిగాయి. అమలాపురానికి చెందిన స్పోర్ట్స్ లెజెండ్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం పేరిట ఆయన కుమారులు అంతర్జాతీయ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్, చరణ్ తేజ (సాఫ్ట్‌వేర్ ఇంజినీర్) స్పోర్ట్స్ కాశి అకాడమి ద్వారా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 85 జట్లు పాల్గొన్నాయి. మెన్స్ డబుల్, మిక్స్‌డ్ డబుల్, మెన్స్ 40 ప్లస్ డబుల్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో మిక్స్‌డ్ డబుల్ విభాగంలో కాకినాడకు చెందిన కె.సాయికర్, కె.సరయు ప్రధమ, అమలాపురానికి చెందిన టి.సాయి హర్షిణి, వై.గౌతమ్ ద్వితీయ, కాకినాడకు చెందిన పి.చంద్ర గోపీనాథ్, ఎం.వీరదుర్గ తృతీయ స్థానాల్లో గెలుపొందారు. 40 ప్లస్ మెన్స్ డబుల్ విభాగంలో విశాఖకు చెందిన ఉదయ భాస్కర్, జానీ ప్రధమ, గుంటూరుకు చెందిన జితేందర్, ఖాదర్ మస్తాన్ ద్వితీయ, విజయవాడకు చెందిన డి.సునీల్ కుమార్, ఎస్.రమేష్ తృతీయ స్థానాలు సాధించారు. మెన్స్ డబుల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన పి.చంద్ర గోపీనాథ్, విఘ్నేష్ ప్రధమ, విజయవాడకు చెందిన కె.శ్రీకర్, బి.అభిషేక్ ద్వితీయ, ముంబైకి చెందిన హర్షిత్, గర్వ్ తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. విజేతలకు రూ.1.50 లక్షల నగదు బహుమతులు అందజేశారు. పోటీలు శనివారం ఉదయం ప్రారంభమై ఆదివారం రాత్రితో ముగిశాయి. విజేతలకు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్, చరణ్ తేజ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్‌బాబు, కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి యాళ్ల నాగ సతీష్, ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రతినిధులు తిక్కిరెడ్డి శ్రీనివాసరావు, కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్ తదితరులు నగదు బహుమతులు అందజేశారు.
ఉత్సాహంగా ఏఎస్సార్
జాతీయ వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని గొల్లవిల్లిలో భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఏఎస్‌ఆర్ (అరిగెల శ్రీరంగయ్య) టోర్నమెంట్ మెన్, వుమెన్ జాతీయ స్థాయి డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మెదటి మ్యాచ్‌లో జీఎస్‌టీ ముంబై, ఎస్‌ఏఐ కేరళ జట్టుపై జీఎస్టీ ముంబై జట్టు విజేతగా నిలిచింది.


