సెల్ఫ్ అసెస్‌మెంట్‌కు వేళాయె..
ఫ నేటి నుంచి ఎస్‌ఏ–3 పరీక్షలు
ఫ హాజరుకానున్న 1.07 లక్షల మంది
విద్యార్థులు
రాయవరం: విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు విద్యాశాఖ పలు పరీక్షలు నిర్వహిస్తోంది. ఏటా నాలుగు సెల్ఫ్ అసెస్‌మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు జరుపుతోంది. ఇందులో భాగంగా స్వీయ అంచనా–3 పరీక్షలను ఈ నెల 5వ తేదీ సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చేపట్టనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు 2022 నవంబర్ నుంచి ఎఫ్‌ఏ–1 పరీక్షలను ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్‌మెంట్’ విధానంలో ప్రారంభించారు. గతంలో సీబీటీ పరీక్షలను రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్‌కు అమలు చేయగా, ఇప్పుడు పూర్తిగా నాలుగు సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షలను సీబీటీ విధానంలోనే నిర్వహిస్తున్నారు. గతంలో 1–8 తరగతులకు మాత్రమే సీబీటీ విధానం అమలు చేయగా, ఇప్పుడు 9వ తరగతి వరకూ అమలు చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు మాత్రం గతంలో మాదిరిగానే డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇందుకు సంబంధించి డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నమైంది. సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ప్రశ్నలు ఎంయూఏ విధానంలో ఇస్తారు. ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైపులో ఇస్తారు. 15 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానం, ఐదు మార్కులకు రాత పూర్వక జవాబు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలన్నీ కూడా విద్యార్థి సమగ్రంగా అంచనా వేసే విధంగా ఉంటాయి. మెకానికల్.. అండర్ స్టాండింగ్.. అప్లికేషన్ (ఎంయూఏ) విధానంలో ఉంటాయి. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాలి.
నేటి నుంచి 8వ తేదీ వరకు..
సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు సోమవారం నుంచి 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 2,02,532 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ యాజమాన్యాల పరిధిలో 1,08,733 మంది, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 93,799 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండ గా, వీరంతా సెల్ఫ్ అసెస్‌మెంట్–3 పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన వి ద్యార్థులు సాధారణ విధానంలోనే పరీక్షలు రాస్తారు. వీరికి సీబీఏ విధానంలో పరీక్షలు నిర్వహించరు.
మండల కేంద్రాలకు పంపిణీ పూర్తి
పరీక్ష పత్రాలు, ఓఎంఆర్ షీట్లను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పంపిణీ చేశాం. పరీక్ష పేపర్లకు ఎంఈఓలు కస్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.
–బి.హనుమంతురావు,
ప్రధాన కార్యదర్శి, డీసీఈబీ, అమలాపురం
పకడ్బందీగా నిర్వహించాలి
పరీక్షలను ప్రధానోపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహించాలి. క్లాస్ రూమ్ బేస్ట్ అసెస్‌మెంట్ విధానంపై ఉపాధ్యాయులకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన ఉంది. గతంలో నిర్వహించిన సెల్ఫ్ అసెస్‌మెంట్ పరీక్షల మాదిరిగానే సీబీఏ పరీక్షలను కూడా నిర్వహిస్తాం. అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం.
–పి.నాగేశ్వరరావు,
డీఈఓ,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
సెల్ఫ్ అసెస్‌మెంట్‌కు వేళాయె..
సెల్ఫ్ అసెస్‌మెంట్‌కు వేళాయె..


