సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
● స్నోయగం
అవనీతలమంతా హిమాలయమే అయ్యిందా అన్నట్లుగా.. ఉషోదయాన కమ్ముకున్న మంచుతెరలు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేశాయి. కంటి ముందున్న దృశ్యం కానరానంతగా అలముకున్న మంచును.. తన కిరణ కరవాలాలతో ఛేదించలేక భానుడు అవస్థలు పడ్డాడు. వర్షంలా కురుస్తున్న హిమపాతంలో దైవ సన్నిధానాలు.. పచ్చని పొలాలు సరికొత్త అందాలను అద్దుకున్నాయి. ఒంటిని కోసేస్తున్నట్టుగా ఉన్న ఆ చలిలోనే కష్టజీవులు బతుకు పోరాటం సాగించారు. వ్యవసాయదారులు, కూలీలు దట్టమైన మంచులోనే రాకపోకలు సాగించారు. విద్యార్థులు హిమ మహిమను ఆస్వాదిస్తూనే పాఠశాలలకు బయలుదేరారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో ఈ అందాల ‘స్నో’యగాలు ఆదివారం ఆవిష్కృతమయ్యాయి.
– పెరవలి
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026


