రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
యానాం: యానాం– ఎదుర్లంక బాలయోగి వారధిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ బైక్‌పై అమలాపురం వైపు వెళుతున్న ప్రత్తిపాడు చెందిన ఇద్దరు వ్యక్తులు, అదేవిధంగా యానాం వైపు వెళుతున్న తాళ్లరేవు చెందిన ఇద్దరు మరో బైక్‌పై వచ్చి పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురికీ గాయాలు కాగా, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం నేపథ్యంలో వంతెనపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలి ఐ.పోలవరం స్టేషన్ పరిధికి వస్తుందని వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక పోలీసులు తెలిపారు.


