రాజమహేంద్రవరం సిటీ: సత్యసాయిబాబా శత జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆయన ముఖచిత్రంతో రూ.100 విలువైన స్మారక నాణేన్ని విడుదల చేసింది. తెలుగువారికి సంబంధించి గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం నాణెం విడుదలైంది. ఇప్పుడు సత్యసాయిబాబా పేరు మీద రెండో సారి విడుదల చేశారు. ఈ నాణేన్ని రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ నాణేల సేకరణకర్త పెద్దిరెడ్డి శ్రీనివాస్ సేకరించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ టంకశాలలో ముద్రించిన ఈ నాణెం బరువు 35 గ్రాములు. కాగా.. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింక్, 5 శాతం నికెల్‌తో దీన్ని తయారు చేశారు.
సత్యసాయిబాబా స్మారక నాణెం


