జాతీయ స్థాయి హాకీకి ఎంపిక
చాగల్లు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) అండర్–19 జాతీయ స్థాయి హాకీ పోటీలకు చాగల్లు గ్రామానికి చెందిన ఉయ్యూరు శాంతి ఎంపికై ంది. స్థానిక వ్యాయామోపాధ్యాయిని జె.విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. గత నెల 19 నుంచి 22వ తేదీ వరకూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ఐ అండర్–19 రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో శాంతి అత్యద్భుత ప్రతిభ చూపింది. తద్వారా జనవరి 2 నుంచి 6వ తేదీ వరకూ గ్వాలియర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆమెను ప్రధానోపాధ్యాయులు వాసవి, ఇతర ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ నందిని, గ్రామస్తులు అభినందించారు.
ఏపీఎన్‌జీజీఓ సంఘం జిల్లా
అధ్యక్షుడిగా మాధవరావు
రాజమహేంద్రవరం సిటీ: ఏపీఎన్‌జీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మీసాల మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు మంగళవారం రాజమహేంద్రవరంలో జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ విజయకృష్ణ. కోశాధికారిగా ఎం.సత్యనారాయణరాజు, సహాధ్యక్షుడిగా త్రినాథ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.ధర్మేంద్ర, ఎస్‌కే ఖాసిం సాహెబ్, కె.కేదారేశ్వరరావు, షేక్ సత్తార్, జి.ఆశవల్లి, మహిళా ఉపాధ్యక్షురాలిగా వి.కమల, కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా ఎన్‌వీఎస్ ప్రతాప్, పి.ఆనందరావు, కె.కృష్ణప్రియ, సీహెచ్ ఆంజనేయులు, షఫియా, మహిళా సంయుక్త కార్యదర్శిగా సూర్యకల్పన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎస్‌బీవీ రాంప్రసాద్ తెలిపారు, సహాయ ఎన్నికల అధికారిగా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, పరిశీలకుడిగా షేక్ నాగూర్ షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కార్యదర్శి మాధవరావు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు రామ్మోహనరావు, కార్యదర్శి మూర్తిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఐదు రోజుల పని దినాలు
అమలు చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: చిరకాల డిమాండ్ అయిన ఐదు రోజుల పనిదినాల సాధనకు నిరంతర పోరాటం సాగిస్తామని బ్యాంక్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు తెలిపారు. ఈమేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యాన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంబాల చెరువు బ్రాంచి వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సంఘం నాయకుడు లక్ష్మీపతి మాట్లాడుతూ, పదేళ్లుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు తమ ప్రథాన డిమాండ్‌ను పెడచెవిన పెడుతున్నాయని ధ్వజమెత్తారు. పాపారావు మాట్లాడుతూ, బ్యాంకుల్లో ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో మిగతా రంగాల మాదిరిగానే బ్యాంకు ఉద్యోగులకు కూడా ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ స్థాయి హాకీకి ఎంపిక
జాతీయ స్థాయి హాకీకి ఎంపిక


