● వెలుగులు నింపిన రోజు
మానవ హృదయాల్లో అంధకారాన్ని పారదోలి వెలుగులు నింపిన రోజు క్రిస్మస్. ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువు సుగుణాలైన పరిశుద్ధత, పవిత్రత, తగ్గింపు స్వభావం, ప్రేమ, దయ, త్యాగం అలవరచుకుని ఆచరించటమే నిజమైన క్రిస్మస్. – రెవరెండ్ పాస్టర్ వల్లభనేని రాంబాబు,
ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ నిడదవోలు నియోజకవర్గ రీజినల్ చైర్మన్
● దైవ, మానవ సంబంధాల పునరుద్ధరణే..
మానవ చరిత్రకు మరో మలుపు క్రిస్మస్. దేవ కుమారుడు మానవునిగా జన్మించడం దైవ, మానవ సంబంధాల పునరుద్ధరణకు నాంది. క్రీస్తు జననంతో పాపాంధకారంలో ఉన్న మానవాళికి విమోచన, నిత్య జీవం లభించాయి.
– రెవరెండ్ పాస్టర్ పి.శ్యామ్‌పాల్, సమిశ్రగూడెం
● దేవునికి ఇష్టులుగా జీవించాలి
పరిశుద్ధ గ్రంథంలో రాసినట్లు క్రైస్తవ విశ్వాసులు దేవునిపై పరిపూర్ణ భయభక్తులతో, ఆయనకు ఇష్టులుగా జీవించాలి. శాంతి సమాధానాలు పొందాలి. అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన.
– రెవరెండ్ పాస్టర్ ఎస్‌వీ డానియోల్,
నిడదవోలు
● వెలుగులు నింపిన రోజు
● వెలుగులు నింపిన రోజు


