బాహుబలి ఆనప
సాధారణంగా ఆనపకాయ 3 నుంచి 6 కేజీల వరకు బరువు ఉంటుంది. కానీ ఏకంగా 15 కేజీలు ఉంటే ఆశ్చర్యమే కదా. గంగలకుర్రుకు చెందిన అభ్యుదయ రైతు చిట్టావఝుల బాబూరావు కొబ్బరి తోటలో అంతర పంటలతో పాటు కూరపాదులు, తీగపాదులను సాగు చేస్తున్నారు. దేశవాళీ రకం ఆనపకాయ విత్తనాలను నాటారు. పూర్తిగా జీవమృతాన్ని వినియోగించి సాగు చేయడంతో ఆనప కాయ సుమారు 15 కేజీలు దాటి కాసింది. దీనితో పాటు పాదుకు మరో 6 ఆనప కాయలు 12 కేజీలు తూగాయి.
– అంబాజీపేట
గంగలకుర్రులో కాసిన 15 కేజీల ఆనపకాయ


