మహిళా దొంగల ముఠా అరెస్టు
జగ్గంపేట: జ్యుయలరీ షాపులో 350 గ్రాముల వెండి పట్టీలను చోరీ చేసిన ఐదుగురు మహిళలను జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గోకవరం రోడ్డులోని కార్తికేయ జ్యుయలరీ షాపునకు ఈ నెల 9వ తేదీన 8 మంది మహిళలు వచ్చారు. వెండి పట్టీలు కొనుగోలు చేస్తున్నట్టు నటించి 350 గ్రాముల 8 జతల పట్టీలను చోరీ చేశారు. దీనిపై షాపు యజమాని ఫిర్యాదు మేరకు ఎస్సై రఘునందనరావు ఆధ్వర్యంలో పోలీసులు కృపారావు, జయరామ్ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, ఇతర మార్గాల ద్వారా ఆ మహిళల ఆచూకీ గుర్తించారు. వారిలో కావిడి మహాలక్ష్మి (పాలకోడేరు), కావిడి చిన్న ధనమ్మ (పాలకొల్లు), కావిడి పార్వతి (నాగేంద్రపురం), కావడి భవాని (నాగేంద్రపురం), చుక్క నరసమ్మ (దర్శిపర్రు)లను జగ్గంపేట శివారు సత్తెమ్మతల్లి గుడి వద్ద అరెస్ట్ చేశారు. శ్యామల, రత్నం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరందరూ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు.


