గణిత మేధావి రామానుజన్
కె.పెదపూడిలో 1729 ఆకృతిలో కూర్చున్న విద్యార్థులు
అంబాజీపేట: దేశానికి గణిత మేధావిగా శ్రీనివాస రామానుజన్ ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించారని హైస్కూలు హెచ్.ఎం, సీహెచ్.వేణుగోపాలకృష్ణ అన్నారు. కె.పెదపూడి జెడ్పీ హైస్కూల్‌లో గణిత దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. హెచ్‌ఎంతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్‌కు ఎంతో ఇష్టమైన సంఖ్య 1729 అని దీనిని రెండు ఘనముల మొత్తంగా రాయగల చిన్న సంఖ్య కావటంతో దీనిని ‘రామానుజన్ సంఖ్య‘ అంటారని వివరించారు. విద్యార్థులు రామానుజన్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన 1729 ఆకృతి పలువురిని అలరించింది.


