అద్దేపల్లి ప్రభుకు సాహితీ వేదిక పురస్కారం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అనేక సంవత్సరాలుగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రాజమండ్రి సాహితీ వేదిక’ కాకినాడకు చెందిన రచయిత అద్దేపల్లి ప్రభుకు 2025 సంవత్సరానికి ‘సాహితీ వేదిక పురస్కారం’ ప్రకటించింది. ఈ నెల 25న స్థానిక గౌతమీ గ్రంథాలయంలో జరిగే సంస్థ వార్షిక సమావేశంలో ప్రభుకు పురస్కారంతో పాటు రూ.20 వేల నగదు అందజేస్తున్నట్లు నిర్వాహకురాలు కుప్పిలి పద్మ తెలిపారు. క్లిష్టమైన వర్తమానాన్ని తన కథల్లో, కవితల్లో ఆవిష్కరిస్తూ, తెలుగు సాహిత్యానికి చేర్పునిస్తున్నందుకు గాను ఆయనకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు వివరించారు. ప్రభు ఇప్పటికే ఆవాహన, పారిపోలేం, పిట్ట లేని లోకం, పర్యావరణ ప్రయాణాలు, దుఃఖపు ఎరుక కవితా సంపుటాలను, ‘సీమేన్’ కథా సంపుటిని ప్రచురించారు.
అద్దేపల్లి ప్రభుకు సాహితీ వేదిక పురస్కారం


