వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
ధవళేశ్వరం: వీధి కుక్కల దాడిలో ధవళేశ్వరం సంజయ్‌నగర్ కాలనీకి చెందిన మూడేళ్ల బాలుడు కడలి జతిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం జతిన్ కుటుంబం ఊరు వెళ్లేందుకు బయలుదేరారు. తొలుత జతిన్ ఇంటి బయటకు వచ్చి నిలబడ్డాడు. సమీపంలో ఉన్న వీధి కుక్క జతిన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు బాలుడిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన జతిన్‌ను తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్య సేవలకు రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జతిన్ తండ్రి కడలి శివ స్థానిక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.


