లోవరాజు మృతదేహం లభ్యం
గుర్రపు డెక్కలో చిక్కుకుని తేలిన వైనం
సామర్లకోట: గోదావరి కాలువలో గుర్రపు డెక్క తొలగిస్తూ గల్లంతైన చేవూరి లోవరాజు (40) మృతదేహం ఆదివారం గుర్రపు డెక్కలో చిక్కుకుని తేలింది. శుక్రవారం లోవరాజు గుర్రపుడెక్క తీస్తున్న సమయంలో గల్లంతు అయిన విషయం తెలిసిందే. నీటి పంపిణీ దారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుర్రపుడెక్క తొలగింపు పనుల్లో ఎటువంటి జాగ్రత్త చర్యలూ తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నీటి మట్టం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతుని కుటుంబ సభ్యులకు పట్టణ వైఎస్సార్ సీపీ మాజీ అధ్యక్షుడు మద్దాలి శ్రీను ఆర్థిక సహాయం అందజేశారు.
లోవరాజు మృతదేహం లభ్యం


