రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు లేఖన
అంబాజీపేట: జాతీయ వినియోదారుల రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు గంగలకుర్రు అగ్రహారం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని దొంగ లేఖన మహాలక్ష్మి ఎంపికై నట్లు హెచ్‌ఎం అక్కిరాజు శేషసాయి తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో ఈ నెల 20న జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన (ఆంగ్లం) పోటీల్లో లేఖన ప్రతిభ కబర్చి ప్రథమ స్థానంలో నిలిచి రూ.5 వేలు నగదు బహుమతి గెలుపొందిందన్నారు. మంగళవారం విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలో ఆమె పాల్గొననుందని ఆయన తెలిపారు. లేఖన మహాలక్ష్మిని ఎంఈఓలు కాండ్రేగుల వెంకటేశ్వరరావు, మోకా ప్రకాష్, సర్పంచ్ దొంగ నాగేశ్వరరావు, ఎంపీటీసీ విత్తనాల దుర్గాభవాని, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, ఎస్‌ఎంసీ చైర్మన్ తొత్తరమూడి గోవింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.


