వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామాభివృద్ధి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి కృషి చేశాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గ్రామానికి రూ.51.07 కోట్ల లబ్ధి చేకూర్చాం. రూ.1.30 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేశాం. ప్రస్తుతం పథకాలేవీ అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
– మట్టా వెంకట్రావు, సర్పంచ్, ఊనగట్ల
రూ.2.20 కోట్లతో పేదలకు ఇంటి స్థలాలు
జగన్ ప్రభుత్వం హయంలో మా గ్రామంలో రూ.80 లక్షలతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ భవన నిర్మాణాలు చేపట్టాం. రూ.2.20 కోట్లు వెచ్చించి పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాం. 204 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికాం. రూ.1.03 కోట్లతో ఊనగట్ల – అమ్ముగుంట రోడ్డు పనులు నిర్వహించాం. రూ.50 లక్షలతో ఊనగట్ల – కలవలపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టాం.
– ఆత్కూరి గోపీచంద్, ఎంపీటీసీ, ఊనగట్ల
వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామాభివృద్ధి


