కనిపించని సంక్షేమం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, పింఛన్లు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఒక్క సంక్షేమ పథకమూ సక్రమంగా అమలు చేయలేదు. అన్నదాత సుఖీభవను అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో అందించలేదు. గ్రామంలో కొత్త ఫించన్లు నేటికి మంజూరు చేయలేదు. పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు కూడా ఇంతవరకూ మంజూరు చేయలేదు. జగనన్న కాలనీల్లో అంతర్గత రహదారులు, డ్రైన్లు నిర్మించకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
– మెరిపో సూర్యచంద్రం, ఊనగట్ల, చాగల్లు మండలం


