
అలవాటుగా మారింది
చిన్నప్పటి నుంచి ఎడమ చేతితో రాయడం అలవాటైంది. ఏ పని చేయాలన్నా ఎడమ చేతితో చేయడం ఈజీగా అనిపిస్తోంది. బలమైన పనులన్నింటికీ ఎడమ చేతినే ఉపయోగిస్తాను. ఓ పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు ఎడమ చేతితోనే చేస్తాను.
– చింతలపూడి మంగాదేవి, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్, జీహెచ్‌ఎస్, అనాతవరం
చిన్నప్పటి నుంచి అలవాటు
ఎడమ చేతితో రాయడం, పనులు చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంట్లో పనులన్నీ ఎక్కువగా ఎడమ చేతితో చేయడం జరుగుతుంది. నాకు ఇద్దరు అబ్బాయిలు. వారికి ఈ అలవాటు రాలేదు.
– సప్పా శాంతి, గృహిణి, కొంకుదురు
మా అమ్మ నుంచి వచ్చింది
ఎడమ చేతిరాత మా అమ్మకి ఉంది. మా అమ్మ నుంచి నాకు, అలాగే నా కూతురికి ఎడమ చేతి అలావాటు వచ్చింది. సూల్క్‌లో నేను డ్రాయింగ్ వేసేవాడిని. బహుమతులూ వచ్చాయి. ఇప్పడు పెయింట్ వేయడానికి ఉపయోగపడుతోంది.
– కుక్కుల శివకృష్ణ, పెయింటర్, పందలపాక

అలవాటుగా మారింది

అలవాటుగా మారింది