రూ.12 లక్షలతో అక్కౌంటెంట్ పరారు
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన వ్యాపారి గంగుమళ్ల కాసుబాబు వద్ద ఐదేళ్లుగా అక్కౌంటెంట్‌గా పనిచేస్తున్న కంతేటి రాజా రూ.12 లక్షలతో ఉడాయించాడు. దీనిపై కాసుబాబు ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పి.వీరబాబు తెలిపిన వివరా ల ప్రకారం.. అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన రాజా.. వ్యాపారి కాసుబాబు వద్ద అక్కౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 26న రాజాకు వ్యాపారి కాసుబాబు ముమ్మిడివరం సీఎస్‌బీ బ్యాంకులో తాకట్టు పెట్టిన దాదాపు రూ.10 లక్షల విలువైన బంగారు నగలు విడిపించాలని, దానికి రూ.2.25 లక్షలు నగదు ఇచ్చి పంపించారు. అయితే రాజా ఆ బ్యాంకులో బంగారు నగలను తీసుకుని నగదుతో పరారయ్యాడు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
లారీ డ్రైవర్‌పై కేసు
చాగల్లు: నిడదవోలు – పంగిడి రహదారిలో అతి వేగంగా, నిర్లక్ష్యంగా లారీ నడిపి నాలుగు గేదెలు చనిపోవడానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. మీనానగరం గ్రామ శివారులోని ఐఎంఎల్ డిపో వద్ద నిడదవోలు నుంచి పంగిడి వైపు వెళుతున్న క్వారీ లారీ మంగళవారం రాత్రి గేదెలను ఢీకొంది. ఈ ఘటనలో నాలుగు గేదెలు అక్కడికక్కడే చనిపోయాయి. వాటి యాజమాని మంగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
చెట్టుకు ఉరి వేసుకుని రైతు మృతి
నల్లజర్ల: చీపురుగూడెం రిజర్వు ఫారెస్ట్‌లో చెట్టుకు ఉరి వేసుకుని రైతు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మన్నపాలెం గ్రామానికి చెందిన రైతు మానికల వెంకన్నబాబు (35) గత నెల 7వ తేదీన పశువులను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. కానీ తిరిగి రాకపోవడంతో 8వ తేదీన ఆయన భార్య దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. అదే గ్రామానికి చెందిన దానయ్య ఈ నెల 27న మేకలు మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లగా ఒక చోట వెంకన్నబాబుకు చెందిన సైకిల్, చెప్పులు, సెల్‌ఫోన్ కనిపించాయి. ఈ విషయాన్ని వెంటనే వెంకన్నబాబు తండ్రి సత్యనారాయణకు తెలియజేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఒక చెట్టుకు ఎముకల గూడు వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల సాయంతో అది వెంకన్నబాబుదేనని గుర్తించారు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
అంబాజీపేట: దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తుండగా కారును లారీ ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాల పాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇవీ.. అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామానికి చెందిన మామిడిశెట్టి వెంకటపతి (ముసలయ్య) (58), భార్య కనకదుర్గ (54), వీరి కుమారుడు వెంకటరత్నం (32), కోడలు జ్యోతి స్వరూప, మనుమలు 12 ఏళ్ల దీక్షిత, 2 ఏళ్ల చేతన్ ఈ నెల 19వ తేదీ రాత్రి కాళేశ్వరం పుష్కరాలకు కారులో వెళ్లారు. అనంతరం ఈ నెల 20న భద్రాచలంలో దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి తిరిగివస్తుండగా ఈనెల 21వ తేదీన కొత్తగూడెం వద్ద బొగ్గు టిప్పర్ వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కనకదుర్గ, వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందారు. ముసలయ్య విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. జ్యోతి స్వరూప, దీక్షిత, చేతన్ చికిత్స పొందుతున్నారు.
విద్యుత్ షాక్‌తో..
నల్లజర్ల: అనంతపల్లి శివారు కృష్ణమ్మగూడేనికి చెందిన పదిలం శ్రీను (42) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదిలం శ్రీను వ్యవసాయ కూలీ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం పొలం పనికి వెళ్లి వచ్చాడు. తన పశువులను మేత కోసం ఉండాళ్ల చెరువు సమీపానికి తోలుకు వెళ్లాడు. అక్కడ నీరు లేకపోవడంతో దగ్గరలోని బోరు వద్దకు వెళ్లి మోటారు ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. అతడికి భార్య మహేంద్ర, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఒమెన్‌లో అల్లవరం వాసి..
అల్లవరం: మండలంలోని వీరన్న మెరక ప్రాంతానికి చెందిన బద్దె రాజేంద్ర ప్రసాద్ (41) ఒమెన్‌లో వారం రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబ సభ్యు లు, బంధువులు అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. ఒమెన్ దేశంలో పదేళ్లుగా డ్రైవర్‌గా రాజేంద్ర ప్రసాద్ విధులు నిర్వహిస్తున్నాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చి, తిరిగి ఆ దేశానికి వెళ్లిపోయాడు. అక్కడ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూనే జై భీమ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. కాగా.. రాజేంద్ర ప్రసాద్ చనిపోయాడన్న సమాచారం తెలియడంతో, దాన్ని నిర్థారణ చేసుకోవడం కలెక్టరేట్‌లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను అతడి భార్య సుధ ఆశ్రయించారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు ఏపీ ఎన్నార్టీ ద్వారా భారత రాయబారి కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడ వారు విచారణ చేయగా, మే 20న ఒమెన్‌లోని సూర్ పట్టణంలో రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని వివరణ ఇచ్చారు. ఆయన మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహకారం తీసుకున్నారు.
రూ.12 లక్షలతో అక్కౌంటెంట్ పరారు
రూ.12 లక్షలతో అక్కౌంటెంట్ పరారు
రూ.12 లక్షలతో అక్కౌంటెంట్ పరారు


