మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025

Mar 18 2025 12:23 AM | Updated on Mar 18 2025 12:22 AM

గూడు.. గోడు

బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతో కలెక్టరేట్‌కు వచ్చిన ఈమె పేరు గండిపాము మంగ. ఊరు నల్లజర్ల మండలం పోతవరం. ఆమెకు బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలతో కలిపి ఐదుగురు సంతానం. భర్త యేసు కూలి పనులు చేస్తూ బతుకుబండి లాగుతున్నాడు. అత్తమామలు ప్రహరీ కట్టి ఇల్లు ఇచ్చారు. ఆ ఇంటిని పడగొట్టి కొత్తగా ఇల్లు కట్టుకోవాలని మంగ అనుకుంది. అయితే పక్కనే ఉన్న తన బావ, ఆయన కుటుంబ సభ్యులు ఆ స్థలాన్ని ఆక్రమించునేందుకు తమపై దౌర్జన్యం చేస్తున్నారని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఎదుట మంగ కన్నీటి పర్యంతమైంది. ఉన్న ఒక్క ఆధారం కోల్పోతే తాము ఎక్కడ నివసించాలని బోరున విలపించింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై విచారణ జరపాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

పింఛను కోసం..

కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గుత్తుల వెంకటలక్ష్మి భర్త వెంకటరావు ఏడాదిన్నర క్రితం మృతి చెందారు. గత ప్రభుత్వ హయాంలో ఆయనకు వృద్ధాప్య పింఛను వచ్చేది. భర్త మరణాంతరం పింఛను ఆగిపోవడంతో వెంకటలక్ష్మికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. తనకు కనీసం వితంతు పింఛన్‌ అయినా వస్తే కుటుంబ పోషణకు చేదోడుగా ఉంటుందని భావించారు. దీని కోసం గ్రామ సచివాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కలెక్టరేట్‌లో అర్జీ ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి, అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

కాలు లేకున్నా కనికరించరా..?

కోరుకొండ మండలం గానుగూడెం గ్రామానికి చెందిన బీర రాఘవ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు. షుగర్‌ వ్యాధి కారణంగా కాళ్లకు ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత పెరగడంతో 2024 మే నెలలో కాలు తొలగించారు. దీంతో వ్యవసాయ పనులు చేయాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం దివ్యాం పింఛన్‌ అయినా వస్తే బతుకుబండి లాగవచ్చని భావించారు. దీని కోసం వైకల్య ధ్రువీకరణ పత్రం సైతం పొందారు. పింఛను మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరించే నాథుడే లేడు. ఇప్పటికే రెండుసార్లు అర్జీ ఇచ్చినా పింఛను మంజూరు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇంకెన్ని రోజులు తిరగాలంటూ వాపోతున్నారు.

మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 20251
1/2

మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025

మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 20252
2/2

మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement