కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం(పీజీఆర్‌ఎస్)ను అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్‌బీఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (శాంతిభద్రతలు) ఏవీ సుబ్బరాజు సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి 26 అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి, అర్జీదారుల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. సివిల్, చీటింగ్, కొట్లాట కేసులు, కుటుంబ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి.
క్యాన్సర్ రహిత
సమాజం నిర్మిద్దాం
రాజానగరం: ఫార్మాస్యూటికల్స్‌లో నైట్రోసమైన్లను నిర్మూలించడం ద్వారా క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యాన ‘కంట్రోల్ ఆఫ్ నిట్రోసామినేష్ ఇన్ ఫార్మాస్యూటికల్స్ అండ్ అనలిటికల్ టెస్టింగ్’ అనే అంశంపై సోమవారం అంతర్జాతీయ సదస్సు జరిగింది. జీవనశైలి, ఆహారం, ధూమపానం, మద్యపానం వంటి వాటితో పాటు కలుషితమైన మందులు కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని వీసీ అన్నారు. నెట్రోసమైన్ల వంటి కొన్ని విషపూరిత మలినాలు ఆందోళన కలిగించేవిగా నిరూపితమయ్యాయన్నారు. ఈ సందర్భంగా కాన్సినోజెనిక్ పొటెన్సీ కాలిక్యులేషన్స్, రిస్క్ మిటిగేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నైట్రోసమైన్స్ ఇన్ ఫార్ములేషన్ అనే అంశంపై అమెరికాకు చెందిన సైజెన్ ఫార్మాస్యూటికల్స్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి, నైట్రోసమైన్ కంట్రోల్స్ ఇన్ డ్రగ్స్ సింథసిస్ అనే అంశంపై మలేషియాకు చెందిన ఐఎన్‌టీఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ వి.రవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. కెమిస్ట్రీ అధ్యాపకులు డాక్టర్ బి.జగన్‌మెహన్‌రెడ్డి మాట్లాడుతూ, వివిధ రకాల ఔషధాల్లో నైట్రోసమైన్లు ఉండే అవకాశాలను వివరించారు. ఆన్‌లైన్‌లో అమెరికాకు చెందిన కెమ్ టెక్స్ లాబొరేటరీస్ సైంటిస్టు డాక్టర్ నరేష్ కటారి తదితరులు కూడా ప్రసంగించారు. నన్నయ, గీతం వర్సిటీల నుంచి 12 మంది పోస్టర్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి 250 మంది విద్యార్థులు, అధ్యాపకులు హాజరయ్యారు.
హెల్త్ సెంటర్ అభివృద్ధికి
రూ.15 లక్షల విరాళం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో హెల్త్ సెంటర్ అభివృద్ధికి కాకినాడకు చెందిన ఎలైట్ నేచురల్ ఆయిల్స్ ఎండీ డాక్టర్ తోట సుబ్రహ్మణ్యం రూ.15 లక్షల విరాళం ప్రకటించారు. వర్సిటీలో సోమవారం నిర్వహించిన సెమినార్‌కు హాజరైన ఆయన వర్సిటీ అభివృద్ధి తదితర అంశాలపై వీసీ ఆచార్య ప్రసన్నశ్రీతో చర్చించారు. అనంతరం తన తండ్రి తోట హరిబాబు పేరిట ఈ విరాళం ప్రకటించారు. దాతను ఆచార్య ప్రసన్నశ్రీ ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.
రూ.లక్ష విరాళం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక శాంతినగర్‌లోని శ్రీరామకృష్ణా సేవా సమితికి ముత్తా రామన్న సత్రం ఫౌండర్ ట్రస్టీలు డాక్టర్ ముత్తా వెంకటేష్, ముత్తా ప్రసాద్‌బాబు సోమవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని సమితి అధ్యక్షుడు విఎల్ గాంధీ, కార్యదర్శి కె.సతీష్, ఉపాధ్యక్షుడు వక్కలంక రామకృష్ణకు అందజేశారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 26 ఫిర్యాదులు
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 26 ఫిర్యాదులు