సదరం.. స్టాప్‌ | - | Sakshi
Sakshi News home page

సదరం.. స్టాప్‌

Jan 3 2025 2:25 AM | Updated on Jan 3 2025 2:25 AM

సదరం.

సదరం.. స్టాప్‌

జిల్లాలో కేటగిరీల వారీగా పింఛన్ల వివరాలు

పింఛను కేటగిరీ ఇస్తున్న నగదు (రూ.) లబ్ధిదారులు

వృద్ధాప్య 4,000 1,17,177

వితంతు 4,000 64,376

చేనేతలు 4,000 1,304

కల్లుగీత కార్మికులు 4,000 2,433

మత్స్యకారులు 4,000 1,889

ఒంటరి మహిళ 4,000 9,107

దివ్యాంగులు 6,000 32,622

లెప్రసీ 6,000 308

పక్షవాతం వచ్చి వీల్‌ చైర్‌పై ఉన్న వారికి 15,000 1,080

కండరాల బలహీనత, ప్రమాద బాధితులు 15,000 201

కిడ్నీ, లివర్‌, హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ 10,000 46

డయాలసిస్‌ బాధితులు 10,000 288

డయాలసిస్‌ (ప్రభుత్వ) 10,000 185

సికిల్‌సెల్‌ కేసులు 10,000 41

అభయహస్తం 500 5,971

సైనిక సంక్షేమ పింఛన్లు 5,000 2

సాక్షి, రాజమహేంద్రవరం: దివ్యాంగుల సామాజిక భద్రత పింఛన్లు పెద్ద ఎత్తున తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. అందుకు సాకులు వెతుకుతోంది. వైకల్య ధ్రువీకరణ పత్రాలు బోగస్‌వని చూపి, పింఛన్లు తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వైకల్య ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను కొద్ది నెలలు నిలిపివేయాలని నిర్ణయించింది. దివ్యాంగుల్లో వైకల్య శాతాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు నిర్వహించే సదరం శిబిరాలను ఈ నెల నుంచి ఏప్రిల్‌ వరకూ ఏర్పాటు చేయరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తిరిగి తాము ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఈ ప్రక్రియ నిలిపివేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించింది. ఈ పరిణామం దివ్యాంగుల్లో ఆవేదన నింపుతోంది. సదరం శిబిరాలను నిలిపివేసిన నేపథ్యంలో ఇతర పథకాలు, అవసరాలకు వైకల్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలంటే తమ పరిస్థితేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

పింఛన్ల తొలగింపునకేనా?

అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కూటమి ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను భారంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే అనర్హుల గుర్తింపు పేరుతో ఉన్న పింఛన్ల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీకి శ్రీకారం చుట్టింది. పింఛన్ల తొలగింపులో భాగంగా కూటమి ప్రభుత్వం జిల్లాలోని తాడిమళ్ల–1 గ్రామ సచివాలయాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ప్రతి 50 పింఛన్లకు ఒకటి చొప్పున 12 బృందాలు ఆ సచివాలయ పరిధిలో గత నెలలో తనిఖీలు నిర్వహించాయి. పింఛను పొందుతున్న లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలు పరిశీలించాయి. తాడిమళ్ల–1 సచివాలయ పరిధిలో అందిస్తున్న 472 రకాల పింఛన్లపై తనిఖీ పూర్తి చేసి, ప్రభుత్వానికి నివేదించాయి. వీటిలో కొన్ని పింఛన్లు తొలగించాలని నివేదించినట్లు తెలిసింది.

స్పెషల్‌ డ్రైవ్‌

ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం కింద ప్రభుత్వం 17 కేటగిరీల లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తోంది. ప్రధానంగా సదరం సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగులు, కిడ్నీ రోగులకు ప్రతి నెలా రూ.10 వేల చొప్పున అందజేస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం అనర్హులున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా వైకల్య ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ నెల నుంచి నాలుగు మాసాల పాటు.. అంటే ఏప్రిల్‌ వరకూ పింఛన్లపై పరిశీలనకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పొందుతున్న అన్ని కేటగిరీల లబ్ధిదారులపై ఇళ్లవద్దనే వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. దీనికోసం అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడనున్నారు. ఈ క్రమంలోనే సదరం శిబిరాల ద్వారా దివ్యాంగులు పొందిన సర్టిఫికెట్లపై కూడా సమగ్ర విచారణ చేపట్టనున్నారు.

32 క్యాంపులు లేనట్లే..

జిల్లా వ్యాప్తంగా ప్రతి వారం రెండు సదరం శిబిరాలు జరుగుతున్నాయి. ఒక్కో శిబిరంలో 100 మందికి పైగా బాధితులు వైకల్య ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించుకునేందుకు రాజమహేంద్రవరంలోని బోధనాస్పత్రికి వస్తూంటారు. పింఛన్ల వెరిఫికేషన్‌ చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల 1 నుంచి సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సదరం స్లాట్‌ బుకింగ్‌, సదరంలో నిర్వహించే వైకల్య ధ్రువీకరణ పరీక్షలు, శిబిరాలు జిల్లావ్యాప్తంగా నిలిచిపోయాయి. సర్టిఫికెట్లలో సవరణలు, తొలగింపు వంటివి కూడా నిలిపివేశారు. సదరం ప్రక్రియకు నాలుగు నెలల పాటు బ్రేక్‌ పడటంతో మొత్తం 32 శిబిరాలు నిలిచిపోనున్నాయి. అర్హులైన దివ్యాంగులకు అన్యాయం చేసేందుకే ప్రభుత్వం ఈ తరహా చర్యలు తీసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సదరం సర్టిఫికెట్లు దొరికేదెప్పుడో!: జీజీహెచ్‌ వద్ద ఎదురు చూస్తున్న దివ్యాంగులు (ఫైల్‌)

వైకల్య ధ్రువీకరణ సర్టిఫికెట్ల

జారీ నిలిపివేత

ఈ నెల నుంచే అమలు

ఏప్రిల్‌ వరకూ ఇవ్వరాదని

కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు

పింఛన్ల తొలగింపు దిశగా అడుగులు

4 నెలల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి

మరీ వేటు వేసే యోచన

అప్పటి వరకూ సర్టిఫికెట్ల ప్రక్రియకు బ్రేక్‌

అర్హులైన దివ్యాంగుల్లో ఆందోళన

పింఛన్ల తొలగింపు

జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని పింఛన్లు తొలగించారు. గత ఏడాది అక్టోబర్‌లో 2,39,021 మందికి పింఛన్లు అందజేయగా, ఇప్పటికే 2,094 పింఛన్లు తొలగించారు. మృతి చెందిన వారి పింఛన్లు మాత్రమే తొలగించినట్లు అధికారులు చెబుతున్నా.. నెలల వ్యవధిలోనే ఇంత మంది చనిపోతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధానంగా వివిధ కేటగిరీల లబ్ధిదారులు సర్టిఫికెట్ల ద్వారా పొందుతున్న పింఛన్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. రానున్న రోజుల్లో వేల సంఖ్యలో పింఛన్లు తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయని, టీడీపీ నేతలు చెప్పిన వారికి పింఛన్లు తొలగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సదరం.. స్టాప్‌ 1
1/2

సదరం.. స్టాప్‌

సదరం.. స్టాప్‌ 2
2/2

సదరం.. స్టాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement