సమస్యలు జాస్తి.. పరిష్కారం నాస్తి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు జాస్తి.. పరిష్కారం నాస్తి

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వలేదు

మా గ్రామంలో సర్వే నంబర్‌ 52/3లో 20 సెంట్ల భూమిని 2024లో కొనుగోలు చేశాం. పట్టాదారు పాస్‌ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే గ్రామకంఠం భూమి అని చెబుతూ అధికారులు నిరాకరించారు. జిరాయితీ మెరక భూమిగా ఈ భూమి అమ్మిన వ్యక్తి పేరిట గతంలో పట్టాదారు పాస్‌ పుస్తకం ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. మా భూమిని పక్క రైతు భూమితో కలిపి రీ సర్వేలో మొత్తం 25 సెంట్లు ఆన్‌లైన్‌ చేశారు. మా భూమికి విడిగా ఆన్‌లైన్‌ చేసి, పట్టాదారు పాస్‌ పుస్తకం ఇవ్వాలని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసి తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు.

– కముజు శ్యామల, సత్యనారాయణ దంపతులు, పశువుల్లంక, ఐ.పోలవరం మండలం

అమలాపురం రూరల్‌: ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అర్జీలు ఇవ్వడమే తప్ప తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 295 మంది వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) వి.సుబ్బారావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ జి.మమ్మీ, ఆర్‌డీఓ సరళాదేవి తదితరులు అర్జీలు స్వీకరించారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 36 అర్జీలు

అమలాపురం టౌన్‌: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో 36 అర్జీలు వచ్చాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ రాహుల్‌ మీనా, ఏఎస్పీ మహేంద్ర మత్తే ఫిర్యాదులు స్వీకరించారు.

హౌసింగ్‌లో అవకతవకలు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్‌ లోన్‌ ఇస్తామని అధికారులు చెప్తే పాత ఇంటిని కూల్చి కొత్తగా నిర్మించుకున్నాను. అధికారులు వచ్చి మా ఇంటి నిర్మాణ పనుల ఫొటోలు తీసుకుని వెళ్లారు. చివరకు నా పేరు హౌసింగ్‌ లోన్‌ లబ్ధిదారుల జాబితాలో రాలేదు. మా గ్రామంలో గతంలో లోన్లు పొంది, రెండంతస్తులు బిల్డింగులు ఉండి, అక్రమ లే అవుట్‌లో ఇళ్లు నిర్మించుకున్న వాళ్లకు అధికారులు హౌసింగ్‌ రుణాలు అందిస్తున్నారు. అముడా పరిధిలో మోడల్‌ విలేజ్‌గా ఎంపికై న మా గ్రామంలో హౌసింగ్‌ రుణాల అవకతవకలపై పూర్తి విచారణ జరపాలి.

– నందుల సత్యనారాయణ, విలసవిల్లి, ఉప్పలగుప్తం మండలం

ఖాళీ బిందెలతో నిరసన

తమకు తాగునీరు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ భట్నవెల్లి గ్రామ పంచాయతీ శివారు కొత్తచెరువు దళితపేటకు చెందిన 30 కుటుంబాల ప్రజలు, మహిళలు కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దళితపేటలో వంద సంవత్సరాల నుంచి జీవిస్తున్నా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వివక్ష చూపుతున్నారనిటావేదన వ్యక్తం చేశారు. తాగునీరు ఇవ్వడం లేదని, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి సౌకర్యాలకు నోచుకోలేదని అన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి వేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారని వారి ఆందోళనకు మద్దతు తెలిపిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొలమూరి మోహన్‌బాబు అన్నారు. దళితపేటకు కిలోమీటరు దూరంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇల్లు ఉందని, అయినప్పటికీ అక్కడి వారిపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. దళితపేటలో వెంటనే తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు, వీధి దీపాల వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు పీజీఆర్‌ఎస్‌లో డీఆర్‌ఓ సుబ్బారావుకు వినతిపత్రం అందజేశారు.

ఫ పీజీఆర్‌ఎస్‌కు అర్జీల వెల్లువ

ఫ ప్రదక్షిణలే తప్ప

పరిష్కారం లేదని ప్రజల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement