రావులపాలెం: తిరుమ ల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డి ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వులూ కలవలేదంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఎటువంటి నిర్ధరణలూ లేకుండా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, ఇంకో అడుగు ముందుకేసి బాత్‌రూములు కడిగే కెమికల్స్‌తో లడ్డూలు తయారు చేసి, అయోధ్యకు పంపారంటూ పవన్ కల్యాణ్ 2024లో తప్పుడు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. అదే సమయంలో నెయ్యి పేరుతో వెజిటబుల్ ఆయిల్స్, రసాయన పదార్థాలతో కల్తీ జరిగినట్టు కూడా చంద్రబాబు అన్నారన్నారు. వారి దుష్ప్రచారం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైందన్నారు. ఈ నేపథ్యంలో గతంలో సీబీఐ, తాజాగా ఈడీ.. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వులూ కలవలేదని స్పష్టమైందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే క్రమంలో తిరుమల వంటి అత్యంత పవిత్రమైన క్షేత్రాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగడం సరి కాదని హితవు పలికారు. ఇకనైనా తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అనుమానాలు, భయాందోళనలు సృష్టించకుండా వాస్తవాలు వివరించాలని డిమాండ్ చేశారు. ఈడీ దర్యాప్తు ద్వారా వెలుగులోకి వచ్చిన వాస్తవాల నేపథ్యంలో.. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగ్గిరెడ్డి సూచించారు.
ఫ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు
జగ్గిరెడ్డి డిమాండ్
ఫ తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ
అసత్య ప్రచారం చేశారు
ఫ అది అబద్ధమంటూ
ఈడీ వెల్లడించిందని స్పష్టీకరణ


