ఇళ్ల స్థలాలు చూపించాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాలు చూపించాలి

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

తమకు ఇళ్ల స్థలాలు చూపించాలని డిమాండ్‌ చేస్తూ ఈదరపల్లి బైపాస్‌ రోడ్డులో నివాసం ఉంటున్న సర్కస్‌ కళాకారులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పది కుటుంబాలకు సమసన గ్రామంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలిచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండేళ్లుగా తమకు స్థలాలు చూపించ లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాము నివాసం ఉంటున్న గుడారాలు ఖాళీ చేయాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని సంఘం నాయకుడు శ్రీనివాస్‌ వాపోయారు. గతంలో ఇచ్చిన ప్రభుత్వ పట్టాలకు సంబంధించి తమకు ఇళ్ల స్థలాలు చూపించాలని కోరుతూ డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement