హామీలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేయాలి

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

అమలాపురం టౌన్‌: గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా బీసీల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేశారని వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం నేతలు అన్నారు. వీటిని కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఈ మేరకు అమలాపురంలో ఆదివారం జరిగిన వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి, రాష్ట్ర బీసీ నేత చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ తీర్మానాలను ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇవీ తీర్మానాలు

ఫ ఆదరణ పథకం పేరుతో బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించి, రూ.3 కూడా ఖర్చు చేయకుండా బీసీలను ఈ ప్రభుత్వం మోసం చేసింది. గడచిన మూడు బడ్జెట్లలో బీసీలకు అన్యాయం చేసింది. తక్షణమే బీసీలకు ఆదరణ పథకంలో రూ.3 వేల కోట్లతో పనిముట్లు ఇవ్వాలి.

ఫ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు నోటి మాటగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ రిజర్వేషన్లను చట్టబద్ధతతో ప్రకటించాలి.

ఫ బీసీలకు రక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదింపజేయాలి.

ఫ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వాలి.

ఫ 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేసి తీరాలి.

ఫ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఒక అధికారిక మద్యం షాపునకు అనుబంధంగా అనధికారికంగా అనేక బెల్టు షాపులు వెలిశాయి. పర్మిట్‌ రూముల పేరిట మద్యం దుకాణాలను బార్లుగా చేశారు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా ఏర్పడి మద్యాన్ని ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు అమ్మడాన్ని తక్షణమే అరికట్టాలి. మద్యం షాపుల పరంగా నెలకొన్న అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి.

ఫ రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయాలి.

ఫ వ్యవసాయ రంగం పలు సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో చంద్రబాబు ఇస్తామన్న రూ.20 వేల సాయాన్ని రైతులకు తక్షణం ఇవ్వాలి.

ఫ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి, పేదల ఆరోగ్యానికి బాసటగా నిలవాలి.

ఫ రాష్ట్రవ్యాప్తంగా రూ.9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణం చెల్లించాలి.

ఫ రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు ఇస్తామంటూ 3 లక్షల దరఖాస్తులు తీసుకున్నారు. తక్షణం ఆ పేదలకు ఇళ్లు ఇవ్వాలి.

ఫ ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీని కూడా వెంటనే అమలు చేయాలి.

ఫ వైఎస్సార్‌ సీపీ

బీసీ విభాగం నేతల డిమాండ్‌

ఫ రౌండ్‌ టేబుల్‌

సమావేశంలో పలు తీర్మానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement