నష్టాల్లో కూరుకుపోయాం | - | Sakshi
Sakshi News home page

నష్టాల్లో కూరుకుపోయాం

Sep 8 2026 12:29 AM | Updated on Sep 8 2026 12:29 AM

రాష్ట్ర స్థాయి బతుకు పోరాట సభలో ఆక్వా రైతులు

వై.జంక్షన్‌ నుంచి భారీ ర్యాలీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా

వరకూ తరలి వచ్చిన రైతులు

ఆక్వా రైతుల ఆందోళనకు అగ్నికుల

క్షత్రియులు, కార్మిక సంఘాల మద్దతు

సాగు విధానం మార్చుకోవాలని పిలుపు

సాక్షి, అమలాపురం: ఆక్వా రంగంలో వనామీ రొయ్యల సాగు తమను సునామీలా ముంచేసిందని, రైతులు కష్టాలు, నష్టాల్లో కూరుకుపోయారని రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు బతుకు పోరాట సభ ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ స్టేట్‌ ఆక్వా ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భగవాన్‌రాజు అధ్యక్షతన అమలాపురంలో సోమవారం ఈ సభ జరిగింది. తమ డిమాండ్లను ఈ నెలాఖరుకు తీర్చకుంటే రైతులతో చర్చించి, సాగుసమ్మె చేస్తామని ఈ సందర్భంగా ఆక్వా రైతు సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాగుసమ్మెతో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో రొయ్యల పెంపకాన్ని తగ్గించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. శ్ఙ్రీమనం ఎన్నాళ్లిలా అడుక్కుందాం? సాగు విధానం సరిగ్గా లేదు. ఇంత పెద్ద ఎత్తున సాగు చేసి నష్టపోతున్నాం. ఫీడ్‌, సీడ్‌, రొయ్యల కొనుగోలు కంపెనీలను పోషిస్తున్నాం. క్రాప్‌ హాలిడే కంటే సాగు తగ్గించడం మేలు. గతంలో 30 కౌంట్‌ గురించి మాట్లాడేవాళ్లం. ఇప్పుడు 100 కౌంట్‌ వస్తే చాలనే పరిస్థితి వచ్చిందిశ్రీశ్రీ అని రైతులు వాపోయారు. శ్ఙ్రీఈక్వెడార్‌లో రైతులే రొయ్య పిల్లలను, మేతను, మందులను ఉత్పత్తి చేసుకుంటున్నారు. అందువలన అక్కడ ఉత్పత్తి ధర తక్కువగా ఉంది. అదే విధానంలో మనం కూడా సాగు చేయాలిశ్రీశ్రీ అని అభిప్రాయపడ్డారు. మనలో ఆశలు పెరిగితే.. కంపెనీలకు దురాశ పెరిగిందని, అసలు మైరెన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంపెడా) ఉందనే విషయమే రైతులకు తెలియడం లేదని రైతు ప్రతినిధులు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఏయే విషయాలు చర్చిస్తున్నారో కూడా రైతులకు అవగాహన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా రైతుకు అర్ధరూపాయి కూడా ప్రయోజనం చేకూరలేదని టీడీపీ, జనసేన పార్టీ అనుకూల రైతులే బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడం గమనార్హం. అంతకు ముందు స్థానిక వై.జంక్షన్‌ నుంచి సభా ప్రాంగణం వరకూ 2 కిలోమీటర్ల మేర ఆక్వా రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, ఫీడ్‌ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ ఆక్వా రైతులు ఈ సభకు తరలి వచ్చారు. వారి ఆందోళనకు అగ్నికుల క్షత్రియులు, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

మేత ధర పెంపు, రొయ్య ధర తగ్గింపు అన్యాయం

మేత ధరలో మార్పునకు 40 రోజులు, రొయ్య ధరల్లో మార్పునకు 15 రోజుల గడువు ఉంది. అయినప్పటికీ పట్టించుకోకుండా మేత ధరలు పెంచేస్తూ, రొయ్యల ధరలు తగ్గించేయడం చాలా అన్యాయం.

– జాన్‌ డేవిడ్‌, ఏపీ స్టేట్‌ ఆక్వా ఫార్మర్స్‌

అసోసియేషన్‌ ప్రతినిధి

ధర తగ్గించకుంటే

ఉద్యమం తప్పదు

రెండో సమావేశం అన్నారు. ఒకటే పెట్టి, ఫార్ములా పేరు చెప్పి ఇష్టారాజ్యంగా రేటు పెంచేశారు. జిల్లాకు ఒక సంఘంగా ఏర్పడి సొంతంగా రొయ్యల మేత కంపెనీలు పెట్టుకోవడమే పరిష్కారం. ప్రభుత్వం తక్షణం స్పందించి, రేటు తగ్గించాలి. లేకపోతే ఉద్యమం తప్పదు.

– యశ్వంత్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు,

ఏపీ స్టేట్‌ ఆక్వా ఫార్మర్స్‌ అసోసియేషన్‌

10 కంపెనీలు ముఖ్యమా!

80 లక్షల మంది భవిత ముఖ్యమా?

ఫీడ్‌, ప్రాసెసింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. కిలోకు రూ.25 వరకూ మేత ధరలు పెంచారు. 8 లక్షల మంది ఆక్వా రైతులు ముఖ్యమా లేక 10 మంది ఉన్న కంపెనీలు ముఖ్యమా అనే విషయాన్ని ప్రభుత్వం తేల్చుకోవాలి. రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు.

– కె.కృష్ణశ్రీ

రైతుల ప్రమేయం లేకుండానే మేత ధరల పెంపు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఇస్తున్నది మేమే. మా ప్రమేయం లేకుండానే మేత ధరలు పెంచారు. మేత తయారీలో కొత్తగా వినియోగిస్తున్న ఫార్ములాకు రూ.130 అవుతుందని చెప్పడం తప్పు. మేము వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా కంపెనీలు ధరలు పెంచాయి. ప్రభుత్వం, అప్సడా, రైతుల అనుమతి లేకుండా ఈ పెంపును ఒప్పుకోం.

– భగవాన్‌రాజు, రాష్ట్ర అధ్యక్షుడు,

ఏపీ స్టేట్‌ ఆక్వా ఫార్మర్స్‌ అసోసియేషన్‌

పరిశ్రమగా

ఎందుకు గుర్తించరు?

ఫీడ్‌ కంపెనీలు మాట తప్పి రాత్రికి రాత్రే ధరలు పెంచుతున్నాయి. రెండు నెలల్లో కిలోకు రూ.25 పెంచడం చాలా దారుణం. పరిశ్రమలను ప్రోత్సహించే పేరుతో రూ.100 కోట్ల స్థలాన్ని వాటికి ఒక్క రూపాయికే ఇస్తున్నారు. అక్కడ వంద మందికి కూడా ఉపాధి రావడం లేదు. మేం ఏటా రూ.18 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఇస్తూ, లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. దీనిని ఎందుకు పరిశ్రమగా గుర్తించి, రాయితీలివ్వరు?

– త్సవటపల్లి నాగభూషణం,

ప్రధాన కార్యదర్శి, ఏపీ స్టేట్‌

ఆక్వా ఫార్మర్స్‌ అసోసియేషన్‌

24 గంటల టైమ్‌

కూడా ఇవ్వకుండా..

ఆక్వా రైతులు కష్టనష్టాల్లో కూరుకుపోయారు. రైతుకు 24 గంటలు కూడా టైమ్‌ ఇవ్వకుండా మేత ధరను కిలోకు రూ.25 పెంచారు. ఈ ప్రభుత్వంలో రైతుకు అర్ధ రూపాయి కూడా మేలు జరగలేదు. సీడ్‌,

ఫీడ్‌లో నాణ్యత లేదు.

– వినాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement