నేడు యఽథావిధిగా పీజీఅర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు యఽథావిధిగా పీజీఅర్‌ఎస్‌

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

అమలాపురం రూరల్‌: జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌ (మీకోసం), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలను సోమవారం యఽథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్‌ గోదావరి భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకోవచ్చని సూచించారు. తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లోనూ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరుగుతుందని, నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి తదితర వివరాల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

వేతన సవరణ సంఘ

ఏర్పాటుపై స్పష్టతేదీ?

ఏపీటీఎఫ్‌ జిల్లా నేతలు

ముమ్మిడివరం: ప్రభుత్వం 12వ వేతన సవరణ సంఘ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేదని, దీంతో ఉద్యోగుల్లో సందిగ్ధత నెలకొందని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌ఎన్‌ మునేశ్వరరావు, మడికి నాగభూషణం తెలిపారు. అమరావతిలో ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలపై వారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా, రెండు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు. మధ్యంతర భృతి ఎప్పుడు ప్రకటిస్తారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదని తెలిపారు.

భక్తులతో కిటకిటలాడిన

గణపతి ఆలయం

అయినవిల్లి: అయినవిల్లిలోని విఘ్నేశ్వరాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లఘున్యాస, ఏకాదశ పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమాలు, అన్నప్రాశనలు, తులాభారాలు, నూతన వాహన పూజలను భక్తులు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 2680 మంది స్వీకరించారు. స్వామికి ఆదివారం ఒక్కరోజు రూ.3,29,751 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

నేడు ఆటో కార్మికుల ధర్నా

అమలాపురం టౌన్‌: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించనున్నట్టు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సత్తిబాబు, ఆటో కార్మికుల సంఘ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆటో అండ్‌ మోటారు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ రాష్ట్ర యూనియన్‌, అనుబంధ సంస్థ ఏఐటీయూసీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ర్యాపిడో, ఊబర్‌ వంటి కార్పొరేట్‌ సంస్థల రాకతో ఆటో కార్మిక రంగం ఉపాధి కరువై కుదేలైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని ప్రభుత్వం నియంత్రించాలని వారు డిమాండ్‌ చేశారు. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీ్త్ర శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల జీవన స్థితి మరింత దిగజారందని సత్తిబాబు, సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement