మాజీ ఎంపీ బోస్
రామచంద్రపురం రూరల్: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజనలో భాగంగా రామచంద్రపురం మున్సిపాలిటీని 28 వార్డుల నుంచి 32 వార్డులుగా పెంచిన విషయం విదితమే. ఈ మేరకు రామచంద్రపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం మాజీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్‌ల ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో వార్డుల పునర్విభజన అశాసీ్త్రయంగా ఉందని బోస్ పేర్కొన్నారు. వార్డుల స్వరూప స్వభావాలు చూపించలేదని, సరిహద్దుల్లో స్పష్టత లేదని తెలిపారు. ప్రతి వార్డులోనూ సర్వే నంబర్ల ఆధారంగా వార్డులను గుర్తించడం వల్ల ఏ వార్డు ఏ ప్రాంతానికి వెళ్లిందనేది ఆయోమయంగా ఉందన్నారు. వార్డుల విభజన జరిగే సమయంలో అటు పార్టీల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వార్డుల్లోని ప్రజలకు కనీస సమాచారం లేకుండా విభజన చేయడం సరైన పద్ధితి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్‌పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, మాజీ వైస్ చైర్మన్ చింతపల్లి నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు వాడ్రేవు సాయిప్రసాద్, బొక్కా సత్యనారాయణ, బాసిన నాగమణి, గాదె సీతా రామలక్ష్మి, పార్టీ పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు మల్లిడి సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ముగ్గురు దేవస్థానం
ఉద్యోగులకు పదోన్నతులు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని ముగ్గురు ఉద్యోగులకు పదోన్నతి లభించింది. సూపరింటెండెంట్ కృష్ణప్రసాద్ ఏఈఓగా, సీనియర్ అసిస్టెంట్లు పోల్నాటి లక్ష్మీనారాయణ, జి సుబ్రహ్మణ్యేశ్వరరావు (విష్ణు)లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందారు. ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.


