అల్లవరం/ఉప్పలగుప్తం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 అధ్యక్షురాలు, మాజీ ఎంపీ చింతా అనురాధ విమర్శించారు. పూటకో అత్యాచారం, రోజుకో హత్య అన్నట్లుగా పరిస్థితి దిగజారిందని అన్నారు. సీ్త్రలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా అమలాపురం ఈదరపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు మంగళవారం ఆందోళన నిర్వహిచారు. ప్లకార్డులు ధరించి చంద్రబాబు ప్రభుత్వం నశించాలని, సీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆందోళన అనంతరం, అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ, సభ్యసమాజం తల దించుకునేలా ఇటీవల గుంటూరులో ఓ మహిళను వివస్త్రను చేసి, దారుణంగా కొట్టి, కాళ్లతో తన్నారన్నారు. బాధితురాలి నుంచి పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోకుండా టీడీపీ నాయకులకు వత్తాసు పలికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉందని విమర్శించారు. ఓ మహిళపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల కేసు పెడితే, పోలీసులు అత్యంత దారుణంగా తిరిగి ఆమె పైనే కేసు నమోదు చేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వీడియో వివాదం, గౌరవప్రదమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉంటూ బీఆర్ నాయుడు అక్రమ సంబంధ వ్యవహారాలు.. చంద్రబాబు రెడ్‌బుక్ పాలనలో మహిళల దుస్థితికి అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. ఒక్క బాధితురాలికై నా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలకు ఒడిగడుతున్న దుర్మార్గులు ఏమాత్రం భయం లేకుండా తిరుగుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులకు ఒకలా, సామాన్యులకు మరోలా చట్టాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. మహిళలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళకు రక్షణ కల్పించలేకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత తమ పదవులకు రాజీనామా చేయాలని అనురాధ డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ, మహిళలపై అత్యాచారాలు, దాడులు చేసిన వారు సాయంత్రానికి ఈ భూమి మీద ఉండరని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు గతంలో ప్రగల్భాలు పలికారని విమర్శించారు. గుంటూరులో మహిళను వివస్త్రను చేయడం అత్యంత దారుణం, బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్లు పాముల రాజేశ్వరీదేవి, గన్నవరపు శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జున్నూరి రామారావు, జున్నూరి వెంకటేశ్వరరావు, సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ, పీకే రావు, రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీను, వంటెద్దు వెంకన్నాయుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరిజా కుమారి, ఆర్‌టీఐ జోన్–2 అధ్యక్షుడు కేటీ వర్మ, ఎస్‌ఈసీ సభ్యులు కాశి మునికుమారి, కుడుపూడి భరత్ భూషణం, వివిధ విభాగాల నాయకులు సరెళ్ల రామకృష్ణ, సుంకర మణికుమారి, చొల్లంగి సుబ్బిరామ్, గుత్తుల రాజు, షేక్ అబ్దుల్ ఖాదర్, సూదా గణపతి, పార్టీ పట్టణ, అల్లవరం, అంబాజీపేట మండలాల అధ్యక్షులు సంసాని చంద్రశేఖర్ (నాని), కొనుకు బాపూజీ, విత్తనాల శేఖర్, ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యులు కొనుకు గౌతమి, మట్టా శైలజ, గూడపాటి రమాదేవి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి తదితరులు పాల్గొన్నారు.
ఫ కూటమి పాలనలో సీ్త్రలకు రక్షణ కరువు
ఫ హోం మంత్రి రాజీనామా చేయాలి
ఫ వైఎస్సార్ సీపీ నేత చింతా అనురాధ డిమాండ్
ఫ అఘాయిత్యాలపై అమలాపురంలో మహిళల నిరసన


