ఉద్యమాల చరిత్రలో చిరస్మరణీయుడు ముద్రగడ | - | Sakshi
Sakshi News home page

ఉద్యమాల చరిత్రలో చిరస్మరణీయుడు ముద్రగడ

Jul 19 2026 12:15 AM | Updated on Jul 19 2026 12:15 AM

ఆయన స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిద్దాం

సంతాప సభలో వైఎస్సార్‌ సీపీ నేతలు

అమలాపురం టౌన్‌: ఉద్యమాల చరిత్రలో ముద్రగడ పద్మనాభం పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని వైఎస్సార్‌ సీపీ జిల్లా ముఖ్య నేతలు అన్నారు. ముద్రగడ ఉద్యమ స్ఫూర్తిని, ఆశయాలను కొనసాగిస్తూ, ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ అమలాపురం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యాన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు అధ్యక్షతన స్థానిక గడియారం స్తంభం వద్ద శనివారం ఉదయం ముద్రగడ సంతాప సభ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్‌కుమార్‌, డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, పాముల రాజేశ్వరిదేవి, గన్నవరపు శ్రీనివాసరావు, మాజీ ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ, ఉద్యమాల పేరు చెబితే ఠక్కున గుర్తుకు వచ్చేది ముద్రగడ పేరేనని అన్నారు. ఆయన మరణం కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలకూ తీరని లోటేనని అన్నారు. కాపులు, బీసీలు, ఎస్సీలు కలసి ఉండాలని ముద్రగడ ఆకాంక్షించే వారని గుర్తు చేశారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే దివంగత సోమసుందరరెడ్డితో ముద్రగడ ఎంతో స్నేహంగా ఉండేవారని గుర్తు చేసుకుని జగ్గిరెడ్డి విలపించారు. ముద్రగడతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనను బాగా కుంగదీసిందని మాజీ మంత్రి విశ్వరూప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, ఎస్‌ఈసీ సభ్యులు కుడుపూడి బాబు, కుడుపూడి భరత్‌ భూషణ్‌, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్య కుమార్‌, కర్రి నాగిరెడ్డి, పాటి శివ, అల్లవరం ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, ఉప్పలగుప్తం, అల్లవరం జెడ్పీటీసీ సభ్యులు గెడ్డం సంపదరావు, కొనుకు గౌతమి, పార్టీ అమలాపురం పట్టణం, అల్లవరం మండల అధ్యక్షులు సంసాని బులినాని, కొనుకు బాపూజీ, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, వంగా గిరిజా కుమారి, కాశి మునికుమారి, చీకట్ల కిషోర్‌, జిన్నూరి వెంకటేశ్వరరావు, ఉండ్రు వెంకటేష్‌, కముజు రమణ, విత్తనాల మూర్తి, మద్దింశెట్టి ప్రసాద్‌, చొల్లంగి సుబ్బిరామ్‌, దొమ్మేటి సత్యమోహన్‌, తోరం గౌతమ్‌ రాజా, కల్వకొలను ఉమ, దూడల ఫణి, కర్రి రాఘవ, కల్వకొలను బాబీ తదితరులు కూడా ప్రసంగించి, ముద్రగడకు ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ ఆత్మశాంతి కోసం నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ముద్రగడ అమర్‌ రహే, జోహార్లు అంటూ నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement